తెలంగాణ

నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 2400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో ఆసుపత్రికి ఆరు వందల కోట్లు ఖర్చవుతుంది. ఇందులో భవనాలు, వైద్య పరికరాలు, మానవ వనరుల వ్యయం కలిసి ఉన్నాయి. ఒక్కో ఆసుపత్రిని నెలకొల్పేందుకు కనీసం 20 ఎకరాలు అవసరమని గుర్తించారు. కాని 10 ఎకరాల కంటే మించి ఎక్కడా ప్రభుత్వ భూమి దొరకడం లేదు. అందుకే కనీసం 12 ఎకరాలు ఉన్న చోట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతి ఆసుపత్రిలో 750 పడకలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 250 పడకలను తల్లి, పిల్లల ఆరోగ్య సంక్షేమం, వారి వైద్య సదుపాయాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. నాగ్‌పూర్ జాతీయ రహదారిపై పేట్ బషీరాబాద్, రాజేంద్రనగర్ వద్ద మైలార్‌దేవ్‌పల్లి వద్ద, మియాపూర్ వద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పనున్నారు. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి గుర్తించి నిధులు విడుదల చేయనున్నారు. ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన రుణాలను బ్యాంకుల నుంచి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది.