తెలంగాణ

మిషన్ భగీరథపై వాటర్ కాంగ్రెస్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రెండు అంతర్జాతీయ సదస్సులకు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో జరిగే ప్రపంచ పర్యావరణ, నీటి వానరుల కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు పిలిచారు. వివిధ ప్రపంచ దేశాల నుంచి సుమారు 1000 మంది నీటి, పర్యావరణ నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ నీటిసరఫరా పథకంతో పాటు నీటి వౌలిక వసతుల కల్పన ద్వారా కలిగే ఫలితాలపై ఈ సదస్సులో కెటిఆర్ ప్రసంగిస్తారు. మే 21 నుంచి 25వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. 22న కెటిఆర్ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు జరిగిన 16 అంతర్జాతీయ సదస్సుల్లో ఇతర దేశాలకు చెందిన వ్యక్తికి ప్రారంభోపన్యాసం చేసే అవకాశం మొదటిసారి కెటిఆర్‌కు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి, తాగునీటి రంగాల్లో సమతుల్యత సాధించే దిశగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపుగా ఈ ఆహ్వానాన్ని కెటిఆర్ అభివర్ణించారు. మే నెల 18,19 తేదీల్లో జరిగే వార్షిక సదస్సులో ప్రసంగించాలని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కెటిఆర్‌ను ఆహ్వానించింది. ఉపాధి- ఉద్యోగాలు, ఎంటర్ ప్రైన్యూర్ ఊప్ అంశాల మీద ప్రసంగించాలని కోరింది.