తెలంగాణ

వేసవి సెలవులపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో పాఠశాలలకు సంబంధించి వేసవి సెలవులపై తీవ్ర గందరగోళం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఈ నెల 15వ తేదీ నుండి సెలవులు ఇస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టడంతో విద్యార్ధుల్లో తల్లిదండ్రుల్లో అయోమయం ఏర్పడింది. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం 22 వరకూ తరగతులు నిర్వహించి, 23 నుండి సెలవులు ఇవ్వాల్సి ఉంది.
అయితే వేసవి ఎండలు తీవ్రం కావడంతో ముందుగానే సెలవులు ఇస్తున్నట్టు సామాజిక మాద్యమాల్లో వార్తలు రావడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి.
మరో రెండు ఎమ్సెట్ కేంద్రాలు
ఎమ్సెట్ పరీక్ష రీజనల్ కేంద్రాలను కమిటీ పెంచింది. ఆదిలాబాద్, మెదక్ కేంద్రాలను రీజనల్ కేంద్రాలుగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోదల్చిన వారు వెబ్ పోర్టల్‌లోకి వెళ్లి కేంద్రాలను మార్చుకోవచ్చని ఎమ్సెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య తెలిపారు. ఇందుకోసం ఈ నెల 16 నుండి 21 వర కూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసే వారు నేరుగా ఈ కేంద్రాలను కోరుకోవచ్చని అన్నారు.
గురుకుల జూనియర్ కాలేజీలకు గడువు
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2017-18 విద్యాసంవత్సరంలో ఇంటర్ మొద టి సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 18వ తేదీ వరకూ గడువు విధించినట్టు సంస్థ కార్యదర్శి బి శేషుకుమారి తెలిపారు.
ప్రవేశపరీక్ష మే 10న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు.