తెలంగాణ

మతరాజకీయాలు మీవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: మతాలను, కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర పశసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. ముస్లింలలో వెనుకబడ్డ వృత్తులు, వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచడం అంశంపై బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించడం పట్ల తలసాని మండిపడ్డారు. ముస్లింలలో పేదలకు, వృత్తిపనివారికి రిజర్వేషన్లను కల్పించేందుకు పెద్దఎత్తున కసరత్తు జరిగిందని చెప్పారు.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జి సుధీర్ చైర్మన్‌గా కమిషన్ ఆఫ్ ఇంక్వ్యరీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కమిషన్ ముస్లింలకు 9 శాతం నుండి 12 శాతం వరకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ సిఫార్సు చేసిందన్నారు. ఆ తర్వాత ఈ నివేదికపై బిసి కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపిందని మంత్రి స్పష్టం చేశారు. బిసి కమిషన్ కూడా ముస్లింలలోని వెనుకబడ్డ వర్గాలు, వృత్తుల వారికి 12 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ సిఫార్సు చేసిందన్నారు. బిసి కమిషన్ తన నివేదికలో పొందుపరిచిన అంశాలనే ముఖ్యమంత్రి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిపై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తలసాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడితే విపక్షాలు అడ్డుకుంటున్నాయని, ఈ విధానాన్ని తాము సహించబోమని ఆయన హెచ్చరించారు.