తెలంగాణ

దేశానికే తలమానికం హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: భారతదేశానికే హైదరాబాద్ తలమానిక నగరమని 21వ శతాబ్దంలో తనకంటూ ఒక చోటును తన నైపుణ్యాలతో చెక్కుకుందని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ అన్నారు. వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ నిర్వహించిన కులీ కుతుబ్‌షా స్మారక కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేసిన అన్సారీ సహనం, సహజీవనం, సాంస్కృతిక సొబగు, సంక్రమిత సంప్రదాయం మేళవించిన హైదరాబాద్ తరతరాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తోందన్నారు. హైదరాబాద్ చరిత్రతో కులీకుతుబ్ షా ప్రమేయాన్ని ప్రస్తావించిన ఆయన ఆయన పాలనలో హిందూ ముస్లింలకు సమాన అవకాశాలు లభించాయన్నారు. పాలకులు, పాలితులు మధ్య మతం, భాష, సాంస్కృతిక అంశాల్లో స్నేహపూరిత వాతావరణమే ఉండేదని అన్నారు. హైదరాబాద్ నగరం నిర్మాణం మహమ్మద్ కులీ కుతుబ్ చేపట్టిన కార్యాలన్నింటిలోకి అత్యంత చిరస్మరణీయమైనదని తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా దీన్ని నిర్మించాడని, 1591లో ఇందుకు పునాది వేశాడని అన్నారు. ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన ఇస్ఫహాన్ రూపకల్పన అనుసరించి అలీం అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చెప్పారు.
ఇబ్రహీం కుతుబ్‌షా మరణానంతరం ఆయన కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1611) అధికారంలోకి వచ్చాడని, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతాలను, రాయలసీమ ప్రాంతాలను జయించి కాకతీయుల తర్వాత మరో మారు తెలుగుజాతిని సమైక్య చేశాడని అన్నారు.అనేక భాషలకు భాగ్యనగరం అలరారిందని, సాంఘిక రాజకీయ పరిస్థితులు దృష్ట్యా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. దీంతో హైదరాబాద్ వినిన్న భాషలు సంస్కృతులకు నిలయంగా మారిందని అన్నారు. దేశంలో మరే నగరంలోనూ ఇన్ని భాషలు , సంస్కృతులు కనిపించవంటే అతిశయోక్తి కాదని అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన కులీ కుతుబ్‌షా
స్మారక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ