రాష్ట్రీయం

యువ హీరో ఉదయ్‌కు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి అరెస్టయిన యువ హీరో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 23న రాత్రి జూబ్లిహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో మూన్ పబ్‌లోకి అనుమతించలేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. కాగా నటుడు ఉదయకిరణ్‌ను గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అతన్ని మూన్ పబ్‌లోకి అనుమతించలేదు, దీంతో అద్దాలు పగులగొట్టి కుర్చీలు ఎత్తివేసి బీభత్సం సృష్టించాడని, అంతటితో అగకుండా పబ్‌లో బట్టలు విప్పుకొని డాన్స్ చేశాడని హోటల్ నిర్వాహకులు కేసు పెట్టారు. ఈ ఘటనలో ఉదయ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా నటుడు ఉదయ్‌కిరణ్ గత చరిత్రంతా నేరాలమయమని తేలింది.
ఇటీవల జూబ్లిహిల్స్‌లో హీరో రవితేజ తమ్ముడితో డ్రగ్స్ రాకెట్‌లో నిందితుడు, జూబ్లిహిల్స్‌లోని ఎయిర్‌పబ్ వద్ద పిస్టల్‌తో సన్నిహితుడిపై దాడికి దిగాడు. మాదాపూర్‌లో నిర్భయ చట్టం కిందన అరెస్టు అయ్యాడు. కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించి ఆమె కూతురితో స్నేహం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అరెస్టు అయ్యాడు. కాకినాడలోని జీఆర్పీ బార్‌లో కూడా గొడవ చేసిన ఘటనలో జైలుకు వెళ్లాడని తెలిసింది. సినిమాలో వేషాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్టు తేలింది. అంతే కాకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ స్నేహితులు, బంధువుల కార్లు అరువుగా తీసుకునే వాడని, తిరిగి ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టేవాడని తెలిసింది. ఇదిలావుండగా ఉదయ్ తల్లి నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్ఫా నర్స్‌గా పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్‌బుక్, పరారే సినిమాల్లో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించాడు. మోసాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తూ జల్సాలకు అలవాటుపడినట్టు విచారణలో తేలిందని సైఫాబాద్ పోలీసులు తెలిపారు. నిందితుడు ఉదయ్‌కిరణ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసు కస్టడికి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు పోలీసులు తెలిపారు.