జాతీయ వార్తలు

17 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంటల్లో చెత్త డంప్.. వందకు పైగా ఇళ్లు బుగ్గి

మృతుల్లో నలుగురు చిన్నారులు శ్రీలంకలో దుర్ఘటన
600 మంది సురక్షిత ప్రాంతాలకు పరారీ
బాధితులకు క్షమాపణ చెప్పిన ప్రధాని

కొలంబో, ఏప్రిల్ 15: శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని కొలన్నావాలో చెత్తకుప్పలో మంటలు చెలరేగడంతో ఆ చెత్తంతా అక్కడున్న మురికివాడ నివాసాలపై పడ్డంతో కనీసం 17 మంది చనిపోయారు. కాగా, ఈ చెత్త డంప్‌ను తరలించడంలో జాప్యం జరిగినందుకు శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ్ సింఘే బాధితులకు క్షమాపణలు తెలియజేశారు. అగ్నిప్రమాదంలో వందకుపైగా ఇళ్లు పూర్తిగా కాలి బూడిద కాగా ప్రమాదం తర్వాత దాదాపు 600 మంది ప్రాణభయంతో అక్కడినుంచి పారిపోయారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులుసహా 17 మంది చనిపోయారని, మరో 14 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. మరింతమంది చెత్తలోపల చిక్కుకుపోయి ఉంటారని భయపడుతున్నారు. చెత్తను తొలగించి చిక్కుకుపోయినవారిని కాపాడడానికి, మృతదేహాలను వెలికితీయడానికి సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దాదాపు 300 అడుగుల ఎత్తుండే చెత్త డంప్‌కు ఆనుకుని ఉన్న మురికివాడ వాసులను కాపాడడానికి అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఆదేశంతో వందలాది మంది సైనికులను రంగంలోకి దించారు. కాగా, ప్రభుత్వం తరఫున బాధితులకు క్షమాపణ చెప్తూ, ప్రధాని రనిల్ విక్రమ్ సింఘే ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలోని చెత్తడంప్‌ను వేరేచోటికి తరలించాలని ఈ ప్రాంతంలోని మురికివాడవాసులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కొలొన్నవ డంపింగ్ యార్డ్‌లో 23 మిలియన్ టన్నుల చెత్త ఉందని, దీనివల్ల చుట్టుపక్కల నివసించే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇటీవల శ్రీలంక పార్లమెంటు సైతం హెచ్చరించింది. ప్రతిరోజూ 800 టన్నుల చెత్త కొత్తగా ఇక్కడికి వచ్చి చేరుతోంది. స్థానికులు కొత్త సంవత్సరాది (ఉగాది)ని జరుపుకొంటున్న సమయంలో చెత్తడంప్‌లో మంటలు చెలరేగి అదంతా ఇళ్లపై పడిపోయింది. ఇది ప్రకృతి విపత్తు కాదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన మానవ తప్పిదమని అధికార పార్టీకి చెందిన స్థానిక ఎంపి ఎంఎస్ మారిక్కర్ ఆరోపించారు.