హైదరాబాద్

గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: గుప్తనిధుల కోసం గుట్టు చప్పుడు కాకుండా పాతబస్తీ హుస్సేనిఆలంలో తవ్వకాలు చేపట్టిన 12 మందిని హుస్సేనీఆలం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. హుస్సేనీఆలంలోని జగదీష్‌హట్స్‌లోని ఇక్భాల్- ఉద్- దౌలాదేవుడీ ఉమర్ ఇంట్లో గుప్తనిధులున్నాయని పాతబస్తీ సంతోష్‌నగర్ ఈదీబజార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఉమర్ అలియాస్ ఇర్ఫాన్(45) నమ్మబలికాడు. దీంతో ఉమర్ మరో పది మందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా 12 రోజుల నుండి తవ్వకాలు చేస్తున్నారు. ఉమర్ అలియాస్ ఇర్ఫాన్‌తో పాటు మరో 10 మంది గుప్త నిధుల కోసం తన ఇంట్లోనే బావి తవ్వుతుండగా సమాచారం అందుకున్న సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడి చేశారు.
ఈ దాడిలో ఇంటి యాజమాని అలీతో పాటు మరో పదకొండు మందిని ఇతర పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిధుల తవ్వకాల కోసం కొన్నిరోజుల నుంచే తవ్వకాలు చేస్తున్నారని తమకు అందిన సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామని చార్మినార్ ఎసిపి అశోక్‌చక్రవర్తి తెలిపారు. హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ బృందం శనివారం ఒమర్ ఇంటిపై దాడి చేశారు. అరెస్టయినవారిలో సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఉమర్, కోట్లహాలీజా ప్రాంతానికి చెందిన మసూద్ అహ్మద్, మెదక్ సంగారెడ్డికి చెందిన అబేద్‌అలీ, సంతోష్‌నగర్ ఎస్‌ఆర్‌టి కాలనీకి చెందిన మహ్మద్ అఫ్సార్, పటాన్‌చెరు కిష్టారెడ్డిపేటకు చెందిన సయ్యద్‌మూజీబ్, మస్మద్ ఖలీల్, ఫలక్‌నూమ జహనుమా ప్రాంతానికి చెందిన మెకానిక్ మహ్మద్‌ఫహార్, రెయిన్‌బజార్‌కు చెందిన సయ్యద్ బిల్లా, నాగారం ఇసిఐఎల్‌కు చెందిన జాబ్ కాన్సల్టెంట్ సి.మహేష్, రెయిన్‌బజార్‌కు చెందిన మహ్మద్ అలాఉద్దీన్, సంతోష్‌నగర్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్‌మూజీబ్, ఇసిఐఎల్ డిఎవి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై.శ్రావణ్ ఉన్నారు.