తెలంగాణ

అందరితో చర్చించాకే అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని పురాతన భవనాలు, ఆస్తులకు (హెరిటేజ్) సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నియమావళి, నిబంధనలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హెరిటేజ్ బిల్లును పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుంటూ, హెరిటేజ్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఆమోదం లభించినప్పటికీ, రూల్స్ రూపొందించేముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. స్వయంగా తానే అఖిలపక్ష సమావేశానికి నేతృత్వం వహిస్తానని, ఏయే భవనాలు, ఏయే కట్టడాలను హెరిటేజ్ జాబితాలోకి తేవాలో అఖిలపక్షంలో చర్చించాకే నిర్ణయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌లాండ్స్ గెస్ట్‌హౌజ్ హెరిటేజ్ పరిధిలోకి రాదని, రాష్ట్ర సచివాలయంలోని ‘జి’ బ్లాక్ పూర్తిగా కూలిపోయి, సమాధిమాదిరిగా మిగిలిందన్నారు. అలాంటి కట్టడాలను తొలిగించడమే మంచిదన్నారు. కాపాడేందుకు అవకాశం ఉన్న అన్ని భవనాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. పురాతన కట్టడాలను ‘ఆర్కియాలజీ’ శాఖకు అప్పగిస్తే, సిబ్బంది లేక వారు నిర్వహించలేకపోతున్నారన్నారు. ప్రముఖ దేవాలయమైన జోగులాంబ దేవాలయం ఆర్కియాలజీ ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభు త్వం దానికోసం ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. గోల్కొండ కోటవద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు కేంద్రం అనుమతి ప్రతి ఏటా తీసుకోవాల్సి వస్తోందన్నారు. ఆర్కియాలజీ శాఖ నిర్వహంచలేని అన్ని భవనాలు, కట్టడాలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు అనుగుణంగా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెరిటేజ్ కట్టడాలను పరిరక్షించేందుకు ఇప్పటికే చట్టం రూపొందించామని, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హెరిటేజ్ భవనాల రక్షణకు సబంధించి బిల్లును ప్రవేశపెట్టామని పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ బిల్లు ప్రతిపాదిస్తూ తెలిపారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 16లో నోటిఫైడ్ ప్యాలెస్ ఉండేదని, ఇప్పుడది మాయమైందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి పురాతన కట్టడాలు ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు.
జిల్లాస్థాయి కమిటీలతో చర్చించాకే హెరిటేజ్ కట్టడాలపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ‘హెరిటేజ్’ బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా శాసనసభ ఆమోదం తెలిపింది.