తెలంగాణ

సిఎం కావాలన్న తొందర లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 17: ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న తొందరేమీ లేదు. మరో పదేళ్లపాటు కెసిఆర్ సిఎంగా ఉంటారని ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. జగిత్యాల బహిరంగ సభలో ప్రసంగించేందుకు వచ్చిన కెటిఆర్ ముందుగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కెసిఆర్ వయసు 64 ఏళ్లు. రాజకీయాల్లో 64 ఏళ్లు యంగ్ ఏజ్. కెసిఆర్ ఇప్పుడే తప్పుకోవలసిన అవసరం లేదు. ఇంకో పదేళ్లపాటు ఆయనే సిఎంగా ఉంటారన్నారు. త్వరలో సిద్ధిపేటలో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. హరీశ్‌రావుకు తనకు మధ్య ఎలాంటి గ్యాప్‌లేదని స్పష్టం చేశారు. హరీశ్‌రావు ఇంటర్వ్యూలు, నా సభలు యాధృచ్చికమే. ఎవరైనా పార్టీ కోసమే పని చేస్తున్నామన్నారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రిని అయ్యాక ప్రజలతో పెద్దగా టచ్ లేదు. అందుకే సభల ద్వారా చేరువవుతున్నట్టు చెప్పుకొచ్చారు. తెరాసకు ప్రత్యామ్నాయం లేదని, హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని అంటూ, గుజరాత్‌లో గెలుస్తామనే పూర్తి నమ్మకం బిజెపికి లేనందుకే ర్యాలీలు చేస్తోందని అన్నారు. ముందస్తు ఎన్నికల కోసం బిజెపి ఎదురు చూస్తోంది. తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా, ఇక్కడ బిజెపికి అవకాశం లేదు, తెరాసకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి తెరాస సిద్ధమేనంటూ, రేపు ఎన్నికలు వచ్చినా మేం ఎదుర్కొంటాం అన్నారు. ఎన్నో కష్టాలు, సవాళ్లను అధిగమించి తెలంగాణ సాధించుకున్నామని, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే మాట అన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కొంత అస్థిరత ఉంటుంది కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి అస్థిరత లేకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా పాలన సాగిస్తున్నామన్నారు. జనానికి చేరువ కావడానికే జనహిత సభలన్నారు. అధికార పక్షాన్ని వేలెత్తి చూపేందుకు విపక్షాలకు ఎలాంటి అజెండా లేదని అంటూనే, ఇచ్చిన మాటమేరకు మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బీసీలకూ ఆరు నెలల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాటు పాలించి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ అంటే ప్రజలకు మొహమెత్తిందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.