తెలంగాణ

ఢిల్లీ పరిస్థితి మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18:నగరంలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు 2013లో విడుదల చేసిన జీవో 20ని కచ్చితంగా అమలు చేస్తామని ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అటవీ, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి పరిశ్రమల యాజమాన్యాలతో కెటిఆర్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరం నుంచి కాలుష్య పరిశ్రమలను ఔటర్ రింగురోడ్డు అవతలకు తరలించాలని 2013లో జీవో 20 జారీ చేశారని, ఇప్పుడు ఆ జీవోను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. లేకపోతే ఢిల్లీ నగరంలా హైదరాబాద్‌ను కాలుష్యం కమ్ముకునే ప్రమాదం ఉందన్నారు. కాలుష్యం నుంచి మహానగరాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం కచ్చితంగా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఔటర్ రింగురోడ్డు అవతల పరిశ్రమల కోసం 17 ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని, క్లస్టర్ల వారీగా ఆయా పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే ఆయా క్లస్టర్లలో ప్రభుత్వం కల్పించాల్సిన వౌలిక వసతుల కల్పన పూర్తయిన తర్వాతనే పరిశ్రమల తరలింపు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. ఇది దశలవారీగా ఉంటుందని, ఈ ప్రక్రియ ఆచరణాత్మక, ప్రాక్టికల్ దృక్ఫథంతో ఉంటుందన్నారు. దీనికోసం అవసరమైయిన ప్లానింగ్‌లో పరిశ్రమలతో కలిసి పని చేస్తామని, అందుకే సమావేశం నిర్వహించినట్టు మంత్రి చెప్పారు. తరలి వెళ్లాల్సిన వాటిలో 50 శాతానికి పైగా లైఫ్ సైనె్సస్, ఫార్మా కంపెనీలే ఉన్నాయని, వీటన్నింటికీ అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన ఫార్మాసిటీ కేంద్రంగా ఉంటుందన్నారు. పార్మాసిటీలో తొలి ప్రాధాన్యత హైదరాబాద్ నగరం లోపలవున్న ఫార్మా కంపెనీలకే అవకాశం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లే వరకైనా జీరో లిక్విడ్ డిశ్చార్జి ఆధునాతన ఏర్పాట్లు చేసుకోవాలని, వ్యర్థాలను అరికట్టాలని, ప్రమాణాలను పెంచుకోవాలని కోరారు. పరిశ్రమలు పెరుగుదలకు సహకరిస్తూనే చట్టాల అమలులోనూ తాము కచ్చితంగానే ఉంటామని చెప్పారు.
పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన డ్రైవ్ చేపడతామని, ఈ డ్రైవ్‌లో పారదర్శకంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూస్తామని చెప్పారు. సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు మంత్రులకు సూచనలు చేశారు. పారిశ్రామికవర్గాల సలహా మేరకు ఫిర్యాదులకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పిసిబి అధికారులు, పరిశ్రమ వర్గాలతో ఒక కామన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. కాలుష్య నివారణ కోసం పోలీసు, పిసిబి జిహెచ్‌ఎంసి, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. సనత్‌నగర్ కాలుష్య నియంత్రణ మండలి ఈ సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం మంత్రి జోగు రామన్న కాలుష్య నియంత్రణ కోసం చట్టాలను కచ్చితంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. నాలాల్లోకి వ్యర్థాలను వదిలే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు సిసి టీవి నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టోక్యోలో క్లీన్ ఎయిర్ అథారిటీ తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఇలాంటి అథారిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల్లో మూడొవంతు గ్రీన్ బెల్ట్ మెయిన్ టెన్ చేయాలని, ఈమేరకు హరిత హారం కార్యక్రమం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో సంగారెడ్డి, మేడ్చెల్, భువనగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

చిత్రం... పరిశ్రమల యాజమాన్య సంఘాల నేతలు, యజమానులతో
నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్