తెలంగాణ

నిషేధం ఎత్తేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ బదిలీలపై ఉద్యోగ జెఎసికి సిఎస్ హామీ

త్వరలో పిఆర్‌సి బకాయిల చెల్లింపు వారంలో సమస్యల పరిష్కారానికి కృషి

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఉద్యోగుల సమస్యలు వారంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సి సింగ్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత, పిఆర్‌సి బకాయిల చెల్లింపు వంటి ప్రధానమైన సమస్యలపై సిఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, సిబ్బంది, పెన్షనర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మంగళవారం సిఎస్ ఎస్‌పి సింగ్, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. టిఎన్‌జివోల సంఘ గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్, టిఎన్‌జివో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టిజిఏ అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, జెఎసి నాయకులు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి మహిపాల్‌రెడ్డి తదితరులు సమస్యలను వివరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఉన్నతాధికారులు సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లడం లేదని జెఎసి ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సిఎస్ ఎస్‌పి సింగ్ జెఎసి నేతలతో సమావేశమై చర్చించారు. బదిలీలపై ఉన్న నిషేధంపై మూడు నాలుగు రోజుల్లో సిఎం వద్దకు ఫైల్ పంపించడంతోపాటు ఈ అంశాన్ని వివరించడానికి సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో కలిసి మూడు, నాలుగు రోజుల్లో సిఎంతో సమావేశమై చర్చించనున్నట్టు హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పిఆర్‌సి బకాయిల చెల్లింపు రెండు అంశాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. జెఎసి నేతలంతా సిఎంకు సన్నిహితులు కావడంతో మీరు కూడా నేరుగా ఆయన దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తే తమ పని సులువు అవుతుందని సిఎస్ ఎస్‌పి సింగ్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన సిబ్బందిని త్వరగా రప్పించడానికి చర్యలు తీసుకుంటామని సిఎస్ హామీ ఇచ్చారు. కంట్రీబ్యూషన్ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తేవాలంటూ కేంద్రపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తేవాలని కోరగా సిఎస్ సానుకూలంగా స్పందించినట్టు జెఏసి నేతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రెండేళ్లు, తర్వాత మూడేళ్లపాటు సాధారణ బదిలీలపై నిషేధం విధించడం వల్ల ఒక్కో ఉద్యోగి ఆరేడేళ్లు ఒకే చోట పని చేస్తున్నారని జెఎసి నేతలు వివరించారు. బదిలీలపై నిషేధం కొనసాగడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకుందన్నారు. భార్యాభర్త ఉద్యోగులైతై వారిని ఒకేచోటికి బదిలీ చేయాలని సిఎం ఆదేశించడంతో పాటు ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదని సిఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తామని, ఆర్థిక భారంతో కూడుకున్న అంశాలపై మాత్రం సిఎంతో చర్చించి పరిష్కరిస్తామని సిఎస్ హామీ ఇచ్చినట్టు జెఎసి నేతలు తమ భేటీ తర్వాత మీడియాకు వివరించారు.

చిత్రం... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం
ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతో చర్చిస్తున్న ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు