తెలంగాణ

తెరుచుకోని ‘ఎటిఎం’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని వివిధ బ్యాంకుల ఎటిఎంలు గత వారం, పదిరోజుల నుండి పనిచేయడం లేదు. ప్రతి ఎటిఎం ముందు ‘డబ్బులేదు’ (నోక్యాష్) అన్న బోర్డు వేలాడుతోంది. కనీసం 500రూపాయలు తీసుకోవాలన్నా వినియోగదారులకు ఇబ్బంది అవుతోంది. ఏ ఎటిఎంలోనూ సంబంధిత బ్యాంకు వాళ్లు ఎప్పుడు డబ్బు పెడతారో తెలియడం లేదు. ఎటిఎంలో డబ్బు పెట్టిన గంటలోగా సదరు ఎటిఎం ఖాళీ అయిపోతోంది. పేదలు, మధ్యతరగతి వారు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లినా నోక్యాష్ అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో ఎక్కడైనా డబ్బు ఇచ్చినా చాలా 20వేల రూపాయలకు మించి ఇవ్వడం లేదు. రిజర్వ్‌బ్యాంకు నుండి క్యాష్ రావడం లేదని, అందువల్ల క్యాష్ ఇచ్చేందుకు ఇబ్బంది అవుతోందని బ్యాంకర్లు చెబుతున్నారు.