ఆంధ్రప్రదేశ్‌

ఇక పుష్కలంగా పశుగ్రాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 19: పాడి పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాడి రైతుకు భరోసాగా ఉండాలని నిర్ణయించింది. పశువులను పెంచే రైతుకు సౌకర్యాలు కల్పిస్తేనే అటు వ్యవసాయం ఇటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పనులు ఉపాధి హామీ నిధులతో చేసుకునే అవకాశం కల్పించింది. పాడి రైతు అవసరమయ్యే పశుగ్రాసం సాగు, వేసవి నేపథ్యంలో పశువుల దాహం తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం, అజొల్లా జాతి పశుగ్రాసం పెంపకం, ఇతర గడ్డికి అవసరమైన గుంటలు తవ్వుకోవడం, గోదాముల నిర్మాణం, చెరువుల్లో గడ్డి పెంపకం, ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు తదితరాలు ఉపాధి హామీ పథకం కింద చేపట్టవచ్చు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు గుర్తించి, చేపడతారు. ఇప్పటివరకు పనులు ఒకచోట బిల్లులు మరోచోట చెల్లించేవారు. ఇకపై అన్నింటిని ఒకే చోటకు చేర్చి పనులు వేగవంతానికి ప్రభుత్వం మార్గం సుగమంచేసింది. ఉపాధి హామీ నుంచి వచ్చే నిధుల మళ్ళింపును సద్వినియోగం చేసుకుని, పాడి రైతుకు మేలు చేకూర్చేందుకు క్షేత్ర స్థాయిలో వీటిని అమలుచేసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పనులు మాదిరిగా క్షేత్ర స్థాయిలో పారావెటర్నరీ సిబ్బంది అవసరమైన పనులను గుర్తిస్తారు.
ఆయా జిల్లాల్లో కలెక్టర్ నుంచి సాంకేతిక అనుమతి పొందుతారు. పనులు చేయించడం, కొలతలు వేయడం పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. బిల్లుల మంజూరు తదితర వ్యవహారాలు ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారికి అప్పగించారు. ఈ పనుల ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలోని 13,28,863 గేదె జాతి, 7,92,017 గోజాతి పశువులతోపాటు గొర్రెలు, మేకలు తదితరాలకు పుష్కలంగా పశుగ్రాసం అందుబాటులోకి వస్తుంది.

చిత్రం... పాలకోడేరు గ్రామంలో అజొల్లా పెంపకం చేపట్టిన దృశ్యం