ఆంధ్రప్రదేశ్‌

ఆదిత్యుని సన్నిధిలో విదేశీయుడి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 19: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు లేలేత భానుడి కిరణాలతో అటు ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యకర ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ విదేశీయుడి నమ్మకం. సూర్యుడు అన్ని ప్రాంతాలకు మార్గదర్శకుడని,సాంకేతికతకు మూలాధారమని రొమేనియా దేశానికి చెందిన మానసిక శాస్త్ర నిపుణుడు స్ట్ఫోన్ సూర్యనమస్కారాలు నేర్చుకునేందుకు అరసవల్లి వచ్చారు. హిందూ జ్యోతిష్యశాస్త్రం చాలా దృఢమైందన్న నమ్మకంతో స్ట్ఫోన్ ఆ శాస్త్రంపై పట్టు సాధించుకునేందుకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి వచ్చారు. ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రం, సూర్య నమస్కారాలతో సాంకేతిక పరిజ్ఞానానికి జోడించి చెప్పిన మాటలు పరిశీలించాల్సిందేన్నారు. సూర్యహోర, కాలాలను వివిధ ప్రాంతాల్లో పరిశీలించి తన గ్రహస్థితిలో మార్పులను స్వయంగా అద్యయనం చేస్తున్నట్టు వివరించారు.