అంతర్జాతీయం

అన్నంత పనీ చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. విదేశీయులు అమెరికాలో పని చేసెందుకు వీలుగా జారీచేసే హెచ్-1బి వీసా నిబంధనల్లో మార్పుల ఫైలుపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఈ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. తన నిర్ణయంవల్ల అమెరికాకు అత్యంత నిపుణులైన విదేశీయులే వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారు. దీంతో ఉద్యోగాలకోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంచడానికి వీలవుతుందని, అమెరికన్లకు అత్యధిక ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని కూడా ఆయన భావిస్తున్నారు. ‘ప్రస్తుతం మన ఇమిగ్రేషన్ విధానం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. అమెరికన్ వర్కర్ల స్థానంలో బయటినుంచి తక్కువ వేతనాలకు తీసుకువచ్చిన వర్కర్లతో భర్తీ చేస్తున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది’ అని ఫైలుపై సంతకం చేయడానికి ముందు విస్కాన్సిన్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఎప్పుడో తీసుకురావలసిన సంస్కరణలో తొలి చర్య ఇదని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం హెచ్-1బి వీసాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నారని అది తప్పని, అత్యంత నైపుణ్యం కలిగిన, అధిక వేతనాల ఉద్యోగులకు మాత్రమే వాటిని ఇవ్వాలని ట్రంప్ అన్నారు. తగిన అవకాశాలు కల్పిస్తే అమెరికా కార్మికులతో ఎవరు కూడా పోటీ పడలేరని కూడా ఆయన అన్నారు. అమెరికన్లకే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలని తాము భావిస్తున్నామని, ఇది తప్పుకాదని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం అత్యంత నైపుణ్యం కలిగిన వారికే హెచ్-1బి వీసాలు ఇవ్వడానికి వీలుగా చేయాల్సిన మార్పులను విదేశాంగ మంత్రి, అటార్నీ జనరల్, కార్మికమంత్రి, హోంలాండ్ భద్రతా శాఖ మంత్రి సూచించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అనుమతించిన ప్రకారం ప్రతి ఏటా 65 వేల హెచ్-1బి వీసాలను అమెరికా ఇస్తోంది. ఈ వీసాలను జారీ చేయడానికి అమెరికా ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎంచుకొంది. ఇవిగాక మరో 20 వేల వీసాలను అమెరికా విద్యా సంస్థలనుంచి మాస్టర్స్, తదితర ఉన్నత స్థాయి డిగ్రీలు పొందిన వారికి జారీ చేస్తారు. కాగా ఈ ఏడాది హెచ్-1బి వీసాలకోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తగ్గింది. గత ఏడాది 2,36,000 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఈ సంఖ్య లక్షా 99 వేలు మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రభావం హెచ్-1బి వీసాలపై వెంటనే ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. వీసా నిబంధనల్లో మార్పులు అమలులోకి రావాలంటే అవి చట్టం రూపం దాల్చాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.

చిత్రం.. వీసా నిబంధనల్లో మార్పు ఫైలుపై చేసిన సంతకాన్ని చూపుతున్న డొనాల్డ్ ట్రంప్