తెలంగాణ

జర్నలిస్టులకు ఐదు లక్షల వరకు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కింద 2-17-18 సంవత్సరానికి ‘హెల్త్ కార్డుల’ పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్డులను రెండు దశల్లో ఇస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇ. వెంకటేశం తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, కమిషనర్ ఐ అండ్ పిఆర్ జారీ చేసిన అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మొదటి దశలో హెల్త్ కార్డులు ఇస్తున్నామని, జిల్లాల్లో అక్రిడిటేషన్ ఉన్నవారికి రెండోదశలో హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. కమిషనర్ ఐ అండ్ పిఆర్ ద్వారా 2848 మందికి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామన్నారు.
జిల్లాల్లో సుమారు 12 వేల మంది ఉంటారని తెలిపారు. ఐ అండ్ పిఆర్ బోర్డ్ రూంలో గురువారం దాదాపు 100 మంది జర్నలిస్టులు తమ పేర్లను హెల్డ్ కార్డుల కోసం అప్‌లోడ్ చేసుకున్నారు. హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టులు తమ పేర్లు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకునేందుకు వీలుందని, ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల నేరుగా అప్‌లోడ్ చేసుకోలేకపోతే, కమిషనర్ ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో అప్‌లోడ్ సౌకర్యం కల్పించామన్నారు. గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగుతుందని ఆయన వివరించారు.
ఇప్పటికే పేర్లను అప్‌లోడ్ చేసుకున్న వారికి రెండు, మూడు రోజుల్లో అప్రూవల్ లభిస్తుందని, హెల్త్ కార్డులు జారీ అవుతాయని ఆయన తెలిపారు. 2017-18 సంవత్సరానికి ఇప్పటి వరకు 356 మంది జర్నలిస్టులు తమ పేర్లను హెల్త్‌కార్డులకోసం నమోదు చేసుకున్నారని, వీరిలో 177 మంది రెన్యువల్ కాగా, మిగతా 279 మంది కొత్తవారని వివరించారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వెంకటేశం సూచించారు. ఇలా ఉండగా అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులకు కూడా హెల్డ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన కమిషనర్ ఐ అండ్ పిఆర్ నవీన్ మిత్తల్ ద్వారా వెళ్లిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. హెల్త్ కార్డులు కలిగిన జర్నలిస్టులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం ఐదులక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని జర్మలిస్టుల హెల్త్ స్కీం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె. పద్మ తెలిపారు. హెల్త్ స్కీం ఉపయోగించుకునేందుకు నియమావళి రూపొందించామని, ఈ నియమావళికి అనుగుణంగా చికిత్స సౌకర్యాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.