తెలంగాణ

50 ఏళ్ల అభివృద్ధికి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా యూనివర్శిటీని రానున్న 50 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ ఫ్యాకల్టీ సభ్యులతో ఆయన సమావేశమై విభాగాల వారీ రానున్న ఐదు దశాబ్దాల్లో వర్శిటీని ఎలా తీర్చిదిద్దాలో సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల నుండి నివేదికలను తెప్పించుకుని సమగ్ర నివేదిక తయారుచేస్తామని ఆయన పేర్కొన్నారు. యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పాఠ్యప్రణాళికల్లో విద్యాంశాలతో పాటు విలువలనూ చేర్చాలని సూచించారు. యూనివర్శిటీలో పరిశోధనపై ఎక్కువ దృష్టి సారించాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బి సత్యనారాయణ చెప్పారు. ఎంపిక చేసిన అంశాలపై ఈ సందర్భంగా విస్తృత స్థాయి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా విసి ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ వర్శిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, ప్రభుత్వ సానుకూలంగా స్పందించిందని తెలిపారు.