రాష్ట్రీయం

కాకినాడ సెజ్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు.కొత్తపల్లి, డిసెంబర్ 15: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) భూముల్లో జరుగుతున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెజ్ పరిధిలోని యు.కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో రమణక్కపేట గ్రామానికి చేరుకుని ఆందోళనలో పాల్గొని పనులను అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కంచె నిర్మాణం కోసం వేసిన సిమెంటు స్తంభాలను రైతులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే... కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం రైతుల నుండి నేరుగా కొనుగోలుచేసిన, ప్రభుత్వం సేకరించిన భూముల్లో మంగళవారం సెజ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కంచె నిర్మాణం చేపట్టారు. అయితే సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న రైతులు ఈ పనులను అడ్డుకున్నారు. రైతుల భూముల్లో ఎటువంటి పనులూ నిర్వహించరాదని పట్టుపట్టారు. అయినప్పటికీ కంచె నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో, కంచె కోసం వేసిన సిమెంటు స్తంభాలను రైతులు పీకివేసి, ధ్వంసంచేశారు. సెజ్ ప్రతినిధులు ఫిర్యాదుమేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను సైతం నెట్టుకుంటూ వెళ్లి, స్తంభాలను ధ్వంసంచేశారు. ఈ సమయంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, ఆందోళనలతో సుమారు రెండు గంటలపాటు రమణక్కపేట గ్రామం దద్దరిల్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వచ్చే శాసనసభ శీతాకాల సమావేశాల్లో సెజ్ భూముల అంశాన్ని తమ పార్టీ లేవనెత్తుతుందని రైతులకు హామీయిచ్చారు. సెజ్ యాజమాన్యం పనులు ఆపకపోతే తమ ఉద్యమం మరింత ఉద్ధృతంచేస్తామని ఈసందర్భంగా రైతు నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు చింతా సూర్యనారాయణ, బావిశెట్టి నారాయణస్వామి, జ్యోతుల బాబులు, పి సుబ్బిరెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.