తెలంగాణ

కష్టం కాంగ్రెస్‌ది.. ఫలితం బిజెపిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 20: భారతదేశంలో కష్టం చేసింది కాంగ్రెస్ అయితే లాభం పొందుతున్నది మాత్రం బిజెపి అని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బడుగు, బలహీన వర్గాల గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, పేదల ఓట్ల కోసమే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేద్కర్ పేరును పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అంబేద్కర్ జయంతి రోజున కనీసం పూలమాల వేయలేదని విమర్శించారు. అంబేద్కర్ సామాన్య వ్యక్తి కాదని, దేశశక్తి అని.. ఆయన రచించిన రాజ్యాంగం కారణంగా దేశం ముందుకు సాగుతోందని చెప్పారు.
రాజ్యాంగం దళిత, గిరిజనులకు సంబంధించినదే కాదని 130 కోట్ల ప్రజలకు ఉపయోగపడేదని తెలిపారు. ప్రజల కష్టాలను, నష్టాలను దూరం చేసి హక్కులను కల్పించిందే రాజ్యాంగమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అంబేద్కర్ పేర్లతో చేపడుతున్న కార్యక్రమాలు దళిత, పేదల ఓట్ల కోసమేనని, ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటంగానీ.. విగ్రహంకానీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పొందుపర్చిన వాటిని కాంగ్రెస్ అమలు చేస్తూ వచ్చినందుకే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఏనాడైనా పూలమాల వేసి నివాళులర్పించారా? అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ఇటీవల అంబేద్కర్ జయంతి రోజున కనీసం పూలమాల వేయలేదని విమర్శించారు. పార్లమెంటు ఎదురుగా ఉన్న విగ్రహానికి రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, ప్రధానమంత్రి, స్పీకర్‌లు నివాళులర్పించగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి అంబేద్కర్‌ను మరవడం దురదృష్టరమని తెలిపారు. చాయ్‌వాలా ప్రధాని అవడానికి కారణం కాంగ్రెస్ ఏర్పాటుచేసిన రాజకీయ వ్యవస్థే అని చెప్పారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలన కారణంగానే దేశం అభివృద్ధి పథంలో వెళ్తోందనీ.. మూడేళ్ళ బిజెపి పాలనలోనే అంతా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ‘గుజరాత్ సిఎంగా ఎంతమంది పేదలను, రైతులను ఆదుకున్నారు.. ఎన్ని కోట్లు రైతుల రుణాలు మాఫీ చేశారని’ ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు వేలాది కోట్ల రూపాయల రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయగా, తెలంగాణ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణాలు మాఫీ చేయడంతో వారి మాఫీ వడ్డీకే సరిపోయిందని ఇది విచిత్రమని వాపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉండటానికి కారణం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అని వివరించారు. ప్రస్తుతం 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు ఇతర దేశాలకు ఎగుమతి స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశానికి అన్నీ చేసిందనీ.. విద్యుదీకరించింది కాంగ్రెస్ అయితే స్విచ్ ఆన్ చేస్తున్నది ప్రధాని మోదీ అనీ.. రోడ్లు, రైల్వే లైన్లు సైతం వేసింది కాంగ్రెస్ అని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రాకెట్లను తయారు చేసింది కాంగ్రెస్, ఆకాశంలోకి ప్రయోగించింది బిజెపి అని తెలిపారు. పేదలకు ఆహారభద్రత కార్డులు, ఉచితవిద్య, మధ్యాహ్న భోజన పథకాలను ప్రారంభించిన కాంగ్రెస్‌ను ప్రజలు మరువరాదని పిలుపునిచ్చారు.
చిత్రం..బహిరంగ సభలో మాట్లాడుతున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే