తెలంగాణ

గజ్వేల్ అథారిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా హనుమంతప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ (గడా) ప్రత్యేక అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎం. హనుమంతప్పను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. గజ్వెల్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ అథారిటీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కెసిఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గజ్వెల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక అథారిటీగా 2014 లోనే ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఇప్పటి వరకు ఈ అథారిటీకి అధికారిగా కొనసాగుతూ వస్తున్నారు.