తెలంగాణ

రైతుల ఖాతాల్లోకి చెరకు అమ్మకం పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: చెరకు రైతుల ఖాతాల్లోకే దాని అమ్మకం పన్నును నేరుగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ షుగర్, కేన్ కమిషనర్ భద్రు మల్లోత్ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. చెరకు అమ్మకం పన్నును దాదాపు 16 సంవత్సరాల నుండి చెరకు ధరతో కలిపి ఇస్తున్నారు. టన్నుపై 60 రూపాయలుగా చెరకు అమ్మకం పన్ను ఉంటుంది. ఈ పన్ను వాస్తవంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు చెరకు రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ పన్నును రైతులకే తిరిగి ఇచ్చివేయాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీలే ఈ డబ్బును రైతులకు అందిస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీలు మధ్యవర్తులుగా ఉండాల్సిన పనిలేకుండా ఇక నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమచేయాలని నిర్ణయించినట్టు డైరెక్టర్ వివరించారు.