తెలంగాణ

శతాబ్ది ఉత్సవాలకు నిజాం వారసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు నిజాం వారసులను నలుగుర్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ఆహ్వానించడాన్ని బిజెపి తప్పుపట్టింది. ఈయన ధోరణి చూస్తుంటే బ్రిటిష్ వారినీ పిలిచేలా ఉన్నారని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఎద్దేవా చేశారు. నిజాం వారసులను ఆహ్వానించాల్సిన అవసరం వందేళ్ల తర్వాత ఏం వచ్చిందని ఆయన నిలదీశారు. నిజాం ఆనాడు అంత తేలికగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లలేదని, దానికోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని, అలాంటి నిజాం వారసులను పిలవడం కంటే దిగజారుడు తనం మరొకటి లేదని అన్నారు. అంతా బాగానే ఉందనే భ్రమల్లో టిఆర్‌ఎస్ ఉందని, ఆ కుటుంబ పార్టీలో చీలికలు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
ప్రజాదరణ ఉన్న నాయకుడ్ని టిఆర్‌ఎస్ పక్కన పెడుతోందా అని ప్రశ్నించారు. అలా లేనపుడు హరీష్‌రావు ప్రస్తావన కెటిఆర్ ఎందుకు తీసుకువస్తున్నారని అడిగారు. రాష్ట్రంలో పాలన అద్భుతంగా ఉందనేది ఓ అభూత కల్పన మాత్రమేనని అన్నారు. అన్నింటిలో నెంబర్-1, తెలంగాణ నెంబర్ -1 అని కెటిఆర్ అంటే, ఒకటి నుండి వెయ్యి వరకూ అంతా మా నానే్న అంటూ కవిత అనడం చూస్తుంటే తెలంగాణ ప్రజలు అంతా పరేషాన్ అవుతున్నారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ డ్రామా సమితిలా మారిందని చెప్పారు. ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్శిటీలకు రెండేళ్లు వీసీలు లేకుండా ఈ ప్రభుత్వం చేసిందని అన్నారు.
తెలంగాణ వచ్చాక కెసిఆర్ కుటుంబం కళకళలాడుతుంటే విద్యార్థులు వెలవెలబోతున్నారని చెప్పారు. ఉస్మానియాకు నేక్ అక్రిడిటేషన్ రాకపోవడం వెనుక ప్రభుత్వ సాచివేత ధోరణి ఉందని ఆయన అన్నారు.