తెలంగాణ

అది కుట్రేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కర్ణాటక రాష్ట్ర పరిధిలోని పర్లీ-వికారాబాద్ సెక్షన్‌లో కల్గూపూర్, భల్కీ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి ఔరంగబాద్-హైదరాబాద్ పాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ద.మ.రైల్వే జిఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. చీఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్, చీఫ్ మోటివ్ పవర్ ఇంజినీర్, చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, చీఫ్ ట్రాక్ ఇంజినీర్‌లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిఎం శుక్రవారం సందర్శించారు. సహాయ కార్యక్రమాలను దగ్గర ఉండి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ఆపద సంభవించలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 500 మంది ప్రయాణీకులు ఉన్నారు. రైల్లో ఉన్నవారందరిని ప్రత్యేక బస్సుల్లో సమీపంలోని బీదర్‌కు తరలించి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రైలు పట్టాలు తప్పిన చోట ఎలాంటి డేమేజ్ మార్క్ లేదని, స్విచ్ ఎక్స్‌పాన్సియన్ జాయింట్, ప్లేట్ స్క్రూలు, నట్లు, ట్రాక్ బ్రాకెట్లు తెరచి ఉన్నాయని, దీంతో ఎవరో దుండగుల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైల్వే పోలీసులు, అటు కర్నాటక రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు జాగిలాలతో దుండగుల కోసం పెద్త ఎత్తున గాలిస్తున్నారు. ఈ రూట్లో రైళ్ల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. రైల్లో ఉండిపోయిన ప్రయాణీకులకు అవసరమైన ఆహారం అందిస్తూ, రైల్వే రక్షణ దళం వారి లగేజీలకు భద్రత కల్పిస్తున్నారు.