తెలంగాణ

ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను తీపి మాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు పంట ఉత్పత్తులపై గిట్టుబాటుధరలను కల్పించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తప్పుడు హామీలు ఇవ్వడంలో మోదీ, కెసిఆర్ ఒకటేనన్నారు. అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ మాటను నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణలో కెసిఆర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకుని, ఇప్పుడా అంశాన్ని అటకెక్కించారన్నారు. రాష్ట్రంలో 2.37 లక్షల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పిన కెసిఆర్ ఇంతవరకు ఈ స్కీం కింద ఎన్ని ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టం చేస్తే చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుంటే, ఈ చట్టానికి పార్లమెంటు, రాష్టప్రతి వద్ద ఆమోదం లభిస్తుందని ఎవరూ నమ్మరన్నారు. కేంద్ర విధానాలను దుయ్యబడుతూ, హిందుత్వ పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ ఏ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను నిలువరించలేకపోయారన్నారు. వచ్చే నెల మొదటి వారంలో డిసిసి కమిటీలు, అక్టోబర్ నెలాఖరుకు అఖిల భారత కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. తమ పార్టీ ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని స్వాగతిస్తోందని, కాని ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఎస్టీలకు జీవోతో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పుడు చట్టం ఎందుకన్నారు. కెసిఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ పెంచడం వల్ల ఇప్పటికే అమలవవుతున్న 4 శాతం రిజర్వేషన్ల మనుగడకు ప్రమాదం ఉందన్నారు. ఆదాయం పన్ను శాఖకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఆ శాఖ అరాచకాలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణలో రిజర్వేషన్లతో ఓట్లు దండుకోవాలని టిఆర్‌ఎస్, వ్యితిరేకించి లాభపడాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని, వీరి ఆటలను కాంగ్రెస్ అనుమతించదన్నారు. రాష్ట్రంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పనితీరు బాగుందని ఆయన ప్రశంసించారు.

చిత్రం..శుక్రవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్. చిత్రంలో దిగ్విజయ్‌సింగ్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు