తెలంగాణ

గూడూరును కొట్టిన కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నల్లగొండ, ఏప్రిల్ 21: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ల మధ్య గ్రూపుల గొడవలు పాత పద్ధతిలోనే సాగుతున్న తీరుకు శుక్రవారం హైద్రాబాద్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామక కసరత్తు భేటీ మరోసారి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కుంతియార్‌ల సమక్షంలోనే ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఏఐసిసి సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి బాహాబాహీకి దిగడం ఢిల్లీ పెద్దలను సైతం విస్మయపరిచింది.
తొలుత రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంతో గూడూరుపై చేయిచేసుకోవడం, దాంతో గూడూరు తిరగబడటంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి తాను భువనగిరి నియోజకవర్గానికి స్థానికుడినని భువనగిరి ఎంపిగా పనిచేశానని, గత ఎన్నికల్లోనూ పోటీ చేశానని, ఈ నియోజకవర్గం కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ పూర్తిగా తనకే ఉంటే బాగుంటుందన్న ధోరణిలో చెప్పుకొచ్చారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులిద్దరూ నల్లగొండ జిల్లా వరకే పరిమితం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌లో జోక్యం చేసుకోవద్దని స్థానికుడినయన తానే ఈ నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చూస్తానన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టరుగా ఉంటూ వారి అన్నద్వారా భువనగిరి నియోజకవర్గ రాజకీయాల్లోకి వచ్చి కాంట్రాక్టులే ప్రధానంగా పనిచేస్తున్నారంటూ విమర్శనాత్మకంగా మాట్లాడారు. గూడూరు మాటలతో ఆగ్రహించిన రాజగోపాల్‌రెడ్డి నీలాగా తార్పుడు రాజకీయాలతో ఎదగలేదంటూ గూడూరుపై చేయిచేసుకోగా ఇరువురు తీవ్ర దూషణలతో బాహాబాహీకి దిగారు. వెంటనే ఇతర కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకుని వారిరువురినీ విడిపించి పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అధిష్ఠానానికి ఆశావహుల పేర్లు!
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల డిసిసి నూతన అధ్యక్షుల నియామకానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి ఆశావహుల పేర్లను అందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నూతనంగా ఏర్పడిన జిల్లాలను అనుసరించి డిసిసి అధ్యక్షుల నియామకానికి ఆశావహుల పేర్లను పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డిలు రాష్ట్ర పార్టీ పరిశీలకులు దిగ్విజయ్‌సింగ్‌కు అందించారు. నల్లగొండ జిల్లా నూతన డిసిసి అధ్యక్షుడి రేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కుంభం కృష్ణారెడ్డి, రాంలింగయ్య యాదవ్ ఉన్నారు. సూర్యాపేట నుండి చెవిటి వెంకన్న, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ల పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి అందించారు. అలాగే బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఆశావహుల జాబితాను సైతం అందించారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను అనుసరించి నాయకులు పోటాపోటీగా నల్లగొండ డిసిసితో పాటు బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు పేర్లను ప్రతిపాదించినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.

చిత్రం..బాహాబాహీకి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఏఐసిసి నేత గూడూరు నారాయణరెడ్డి.