తెలంగాణ

తొలిసారిగా చాలెంజ్ సెలక్షన్ ఆప్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాని వారు తమ అభ్యతరాలను చాలెంజ్ చేసుకునే పద్ధతిని తొలిసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కల్పించింది. 2015లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపిక రాని 153 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన దరిమిలా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మూడురకాల మెరిట్ లిస్ట్‌లను ప్రకటించడం, తొలిసారి సమాంతర (హారిజాంటల్) రిజర్వేషన్ విధానం, తొలిసారి మహిళా రిజర్వేషన్ అమలును బోర్డు నియామకాల్లో అమలు చేసిందని బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2015లో ప్రకటించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రకటించిన ఫలితాల్లో 153 మంది ఎంపిక కాలేదు. దీనిపై అభ్యర్థులు తమ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు చాలెంజ్ చేస్తూ వినతిపత్రాలను బోర్డుకు అందజేశారు. దరిమిలా బోర్డు జరిపిన సమీక్షలో వీరిలో 28 మంది ఎంపికకు అర్హులుగా తేల్చింది. మరో 9 మంది కటాఫ్ మార్కులు పరిశీలించిన తర్వాత ఎంపికైన బెటాలియన్ నుంచి మరో బెటాలియన్‌కు మార్పులు చేర్పులు చేసి వారిని మే 2లోగా సంబంధిత శిక్షణ విభాగం చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి రిపోర్టు చేయాలని సూచించారు. కాగా మరో 115 మందిని కటాఫ్ మార్కులు కన్నా తక్కువ రావడంతో ఉత్తీర్ణులు కాలేదని పేర్కొన్నారు. మరో 12 మంది చాలెంజ్ ఆప్షన్‌ను వినియోగించుకోకపోయినప్పటికీ వారిని ఎంపికకు అర్హులుగా గుర్తించి వారి రిజిష్ట్రేషన్ నెంబర్లను ప్రకటించామని వివరించారు.