తెలంగాణ

నల్లధనం తగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశంలో తాజాగా తీసుకున్న ఆర్ధిక సంస్కరణలతో నల్లధనం మాత్రం ఇంకా తగ్గలేదని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై వి రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్ర విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో డాక్టర్ వై వి రెడ్డి మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు పేరుతో దేశ ఆర్ధిక రంగంలో వస్తున్న కీలక మార్పులు , నూతన సంస్కరణలు , ద్రవ్యోల్బణం, ద్రవ్యసమాఖ్య పేరుతో కేంద్రం చేపట్టిన చర్యలు అనూహ్యమైనవని అంటూ కఠిన శిక్షల ద్వారా నల్లధనాన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు. పాలన, అమలు కఠినంగా ఉండాలి తప్ప, చట్టం కఠినంగా ఉండటం కాదని, వాస్తవానికి అత్యధికంగా చట్ట ఉల్లంఘనలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెట్‌కు , ప్రభుత్వానికి మధ్య అంతర్ సంబంధాలు చాలా ముఖ్యమని అన్నారు. జిఎస్‌టి కూడా కొద్ది కాలం పాటు భారత ఆర్ధిక వ్యవస్థకు పెద్దలోటుగా తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ బి కామయ్య , ప్రొఫెసర్ దేబశిష్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.