తెలంగాణ

టార్గెట్ గ్రామీణ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21:గ్రామీణ తెలంగాణను కేంద్రంగా చేసుకుని టిఆర్‌ఎస్ ప్లీనరీ సాగింది. రైతులు, కుల వృత్తులు, గ్రామీణ ప్రజానీకం, సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. 2019 ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ రాజకీయ ఆయుధాలు ఇవే అని తేల్చి చెప్పే విధంగా ప్లీనరీ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏ పార్టీ సమావేశం అయినా హైటెక్ సిటీ, అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అనే అంశాలకే ప్రాధాన్యత ఉండేది. ఈ ఊసే లేకుండా పూర్తిగా గ్రామీణ తెలంగాణ కోణంలోనే ప్లీనరీ సాగింది. డ్వాక్రా సంఘాల తరహాలో రైతు సంఘాలను ఏర్పాటు చేసే వ్యూహం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు బలమైన ఓటు బ్యాంకు తయారు చేసే వ్యూహంగానే కనిపించింది. కులాలు, వృత్తులు, మతాలు ఏమైనా గ్రామాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత భూమి ఉంటుంది, లేదా భూమిపై ఆధారపడి జీవిస్తారు. వ్యవసాయం చేసే రైతు కావచ్చు, వ్యవసాయంపై ఆధారపడిన కూలీ కావచ్చు గ్రామంలో ఉన్న అందరికీ వ్యవసాయంతో అనుంబంధం ఉంటుంది. డ్వాక్రా సంఘంలో గ్రామంలోని కొంత మంది మహిళలే మాత్రమే చేరుతారు. కానీ రైతు సంఘంలో దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు చేరే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రైతు కమిటీల ఏర్పాటు జరిగినా సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్లే నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ, కోటి ఎకరాలకు సాగునీరు వంటిని ఆచరణలోకి వచ్చిన తరువాత సహజంగా ఈ రైతు సంఘాలు అధికార పక్షానికి ఉపయోగపడే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం జరిగిన కొత్తలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు రైతుల అంశానే్న ఆధారం చేసుకుని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. కాలం కలిసి రావడంతో రైతులనే బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా రైతు సంఘాలను తెరపైకి తీసుకు వచ్చింది.
రైతులతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక గురించి కెసిఆర్ ప్లీనరీలో వివరించారు.
కుల వృత్తులకు సహాయం అందించడం, గోర్రెల పెంపకం దారులకు గుర్రెలు అందజేయనున్నారు. హైదరాబాద్‌లో క్షౌర శాలలు ఎలా ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో సైతం అదే విధంగా ఉండేందుకు 25వేల ఆధునిక క్షౌరశాలలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. రజకులకు ఆధునిక వాషింగ్ మిషన్లు అందిస్తున్నారు. దాదాపు ప్రతి కుల వృత్తి వారికి ఏదో ఒక సహాయం అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీల్లో ఎప్పుడూ లేనంతగా గ్రామీణ ప్రాంతాలపై పూర్తిగా దృష్టిసారించే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. కెసిఆర్ ఉపన్యాసం ప్రధానంగా రైతుల గురించే సాగింది. రైతే రాజు అనేది ఆచరణలో చూపిస్తామని చెప్పారు. తొలి తీర్మానం కూడా వ్యవసాయంపైనే చేశారు.
ఇక గ్రామాల్లో పంటలు కోతకు వచ్చిన సమయంలో రైతు కూలీలు దొరక్క ఇబ్బంది కరంగా మారింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని కెసిఆర్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం చేయాలని తీర్మానం చేశారు. దీని వల్ల కూలీలకు ఉపాధి లభిస్తుంది, పంటలు కోసే సమయంలో రైతులకు కూలీలు అందుబాటులో ఉంటారు. దీనికి కేంఅదం సానుకూలంగా స్పందిస్తుందని టిఆర్‌ఎస్ నాయకత్వం ఆశిస్తోంది.
ఐదువేల జెండాలు
కొంపల్లిలో టిఆర్‌ఎస్ 16వ ప్లీనరీ ఉత్సాహంగా సాగింది. కెసిఆర్ వేదికపైకి రాగానే ఒకేసారి ఐదువేల జెండాలు పైకి లేచే విధంగా ఏర్పాటు చేశారు. ప్లీనరీ సభ్యులు ఐదువేల మందికి ముందుగానే జెండాలు అందజేశారు. కెసిఆర్ రాగానే వారంతా లేచి జెండాలను గాలిలో ఊపారు. వేదికపైనే కెసిఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమర వీరులకు నివాళి అర్పించారు. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు పార్టీ నాయకులు కెసిఆర్‌ను అభినందించారు.
తొలిసారిగా ప్లీనరీ వేదికపై నుంచి కాకుండా తెలంగాణ భవన్‌లోనే టిఆర్‌ఎస్ అధ్యక్షునిగా కెసిఆర్ ఎన్నికైనట్టు ప్రకటించారు. తెలంగాణ అమర వీరులకు తొలుత కెసిఆర్ నివాళి అర్పించారు.
తీర్మానాల సంఖ్యను కేవలం ఏడుకే కుదించడం ఇదే మొదటి సారి. ఒక్కో తీర్మానంపై రెండు మూడు నిమిషాల పాటు మాత్రమే కాకుండా కనీసం 40 నిమిషాల పాటు ప్రసంగిస్తే సమగ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెసిఆర్ తెలిపారు.
కేవలం పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ప్లీనరీకి అనుమతించడంతో గందరగోళానికి అవకాశం లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, మీడియా, నిర్వాహకులు ఎవరికైనా పాస్‌లు ఉంటేనే లోనికి అనుమతించారు.