తెలంగాణ

విసిని సాగనంపాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హెచ్‌సియు వైస్-్ఛన్సలర్ అప్పారావును రీ-కాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపిద్దామని అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం అసెంబ్లీ సమావేశంలో హెచ్‌సియు గొడవల అంశంపై పాలక-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ హెచ్‌సియులో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ స్పందించారని, కానీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక్కసారైనా రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్క మాటైనా చెప్పి ఉంటే సంతోషించే వాళ్ళమని అన్నారు. పైగా రోహిత్ మరణిస్తే తాము శవరాజకీయాలు చేస్తున్నామని విమర్శించారని ఆయన తెలిపారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శవరాజకీయాలు చేయలేదని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పేందుకు వచ్చారని అన్నారు. అలా చేయాలనుకుంటే మొత్తం వర్సిటీని దిగ్భంధం చేసే వాళ్ళమని ఆయన తెలిపారు. తాను హెచ్‌సియు పూర్వవిద్యార్థినని, అయినా గేటు వద్దే పోలీసులు నిలిపి వేశారని చెప్పారు. పోలీసు రాజ్యం కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య విషయం తెలిసిన డాక్టర్ ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటే, పోలీసులు అరగంట తర్వాత వచ్చారని అన్నారు. రోహిత్ ఎస్‌సి కాదని హోం మంత్రి చెప్పారని, అది నిజం కాదని తేలితే సభను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని అన్నారు.
అక్బర్ ధ్వజం
మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎబివిపి, సంఘ్ పరివార్ తమ సిద్ధాంతాలను అందరిపైనా రుద్దాలనుకుంటున్నదని విమర్శించారు. వర్సిటీలో మగ పోలీసులు విద్యార్థినుల జడలు పట్టుకుని లాగారని చెపారు. భారత్ మాతాకీ జై అనే నినాదం చేయమంటున్నారని, మాతకు చెందిన బిడ్డలను లాక్కెళ్ళితే అవమానం కాదా? అని ప్రశ్నించారు. విసిని రీ-కాల్ చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిద్దామని సూచించారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు కె. లక్ష్మణ్ అక్బర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ప్రతి ఇంటినుంచి యాకూబ్ మెమన్ పుట్టుకుని వస్తారని అన్నారని ఆయన గుర్తు చేశారు.
తీర్మానం చేద్దాం: వైకాపా
వైకాపా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ విసి అప్పారావును రీ-కాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేద్దామని అన్నారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రసంగిస్తూ హెచ్‌సియుకు కన్హయ్య వస్తున్నందుకే విసి సెలవును కేంద్రం రద్దు చేయించి పంపించిందని దుయ్యబట్టారు. సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ వర్సిటీలో పోలీసు క్యాంపు పెట్టించి, యుద్ధ వాతావరణం సృష్టించారని విమర్శించారు.

చిత్రం మీడియా పాయంట్ వద్ద మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు