తెలంగాణ

‘కవాల్’లో వాహన రాకపోకలపై అధ్యయన కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కవాల్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో వాహనాల రాకపోకలను అనుమతించే విషయమై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంచిర్యాల ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆదిలాబాద్ ఉప రవాణా శాఖాధికారి, ఒక ఎన్‌జివో ప్రతినిధి, మంచిర్యాల అటవీ శాఖాధికారితో కూడిన నలుగురు సభ్యుల కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఏడు నిబంధనలపై అధ్యయనం చేయాలని ఈ కమిటీకి సూచించారు. వాహనాల బరువు, వాటికి ఉన్న చక్రాల ప్రాతిపదికన వాహనాల వర్గీకరణ, ప్రస్తుతం ఉన్న రోడ్డు ఎన్ని టన్నులు ఉన్న వాహనాలను తట్టుకుంటుందనే విషయాన్ని పరిశీలించాలని విధి విధానాల్లో పొందుపరిచారు.