తెలంగాణ

7 స్థానిక సంస్థలకు జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలోని ఏడు స్థానిక సంస్ధల ప్రతినిధులు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకోబోతున్నారు. ఈ నెల 24న లక్నోలో జరిగే కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి చేతుల మీదుగా అవార్డులు తీసుకోనున్నారు. రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కార్‌ను ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ సర్పంచ్ అందుకుంటారు. పంచాయతీ సశక్తీకరణ్ పురస్కారాలను కేంద్ర మంత్రి తోమర్ చేతుల మీదుగా కరీంనగర్ జెడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, మహబూబ్‌నగర్ జిల్లా ఘనపూర్, వరంగల్ జిల్లా తాడ్వాయి ఎంపిపిలతో పాటు నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్, సిరిసిల్ల జిల్లా కస్బి కట్కూర్, గోపాల్‌రావు పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు అందుకుంటారు. ఈ అవార్డు కింద జిల్లా పరిషత్‌కు 50 లక్షలు, మండల పరిషత్‌లకు 25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపాదికన 8 నుంచి 10 లక్షల నగదు నజరానా దక్కనుంది. 2011-12 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవమైన ఏప్రిల్ 24న ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రజ జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ కూడా సోమవారం లక్నో వెళ్ళనున్నారు.