తెలంగాణ

రాజ్యాంగం మాకు హక్కులిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ముస్లింలు తమకు ఓటు వేయకపోయినా కేంద్రం వారికి తగిన గౌరవం ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లింలకు గుర్తింపు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రభుత్వం ఇచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ముస్లింలకు గుర్తింపు ఇచ్చింది రాజ్యాంగం మాత్రమే కానీ, రవిశంకర్ ప్రసాద్ కాదని ఆయన తెగేసి చెప్పారు. రాజ్యాంగమే అందరికీ సుప్రీం అని, రాజ్యాంగం ముస్లింలకు హక్కులు ప్రసాదించినవేనని, వారి హక్కుల పరిరక్షణ బాధ్యత రాజ్యాంగానిదేనని ఒవైసీ స్పష్టం చేశారు.
భారత్‌వంటి ప్రజాస్వామిక దేశంలో నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ తమకు ఉందని, రాజ్యాంగమే సుప్రీం అన్న విషయాన్ని మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు. జమ్ము, కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో పిడిపి-బిజెపి ప్రభుత్వం విఫలమయిందని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి కూడా రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశాన్ని విడగొట్టే ధోరణిలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సంకేతాలనిస్తున్న తన అపకటనకు మంత్రి క్షమాపణ చెప్పాలని మొయిలీ డిమాండ్ చేశారు. అయితే సదరు వ్యాఖ్యలను మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం సమర్థించుకోవడం గమనార్హం.