తెలంగాణ

ఏటా లక్ష ఇళ్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం ఆయన నగరంలోని జివైఆర్ కాంపౌండ్‌లో రూ.15.57 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 168 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,హైదరాబాద్‌లో ఏటా లక్ష ఇళ్లను నిర్మించి తీరుతామని, ఇవి కూడా సరిపోవని, అవసరాలను, నిధులను బట్టి దశల వారీగా ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఇళ్లు సుమారు రూ.45 లక్షల వరకు విలువ చేస్తాయన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం గర్భిణులకు పోషకాహారం అందించేందుకు వీలుగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా జూన్ నుంచి రూ.12 వేలు అందజేయనుందని వివరించారు. అలాగే నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన సుమారు రూ. 2వేల విలువ చేసే కెసిఆర్ కిట్‌ను కూడా జూన్ నుంచి అందించనున్నట్లు ఆయన తెలిపారు. పశు సంవర్థక శాఖ మంత్రి శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సజావుగా పూర్తయ్యేందుకు బస్తీ వాసులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి, బల్గేరియా ప్రతినిధుల బృందం, సికిందరాబాద్ ఆర్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని జివైఆర్ కాంపౌండ్‌లో డబుల్ బెడ్ రూం
ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి కెటిఆర్