తెలంగాణ

పల్లెకు పట్టం .. అప్పుడే బంగారు తెలంగాణ సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిన సర్కార్ ఆలోచన వినూత్న పథకాలతో ముందుకు
కుల వృత్తులకు వెన్నుదన్ను రైతన్నకు ఆర్థికసాయం పనిలోపనిగా కేడర్ బలోపేతం

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆపిల్ నుంచి అమెజాన్ వరకు ప్రముఖ ఐటి కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు గ్రామీణ తెలంగాణం వైపూ దృష్టి సారిస్తోంది. బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే కేవలం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినంత మాత్రాన చాలదన్న సత్యాన్ని రాష్ట్ర ఆవిర్భావానికి ముందే గుర్తించిన టిఆర్‌ఎస్ అధినేత, పాలన పగ్గాలు చేపట్టాక తొలి రెండేళ్లూ రాజధానిపైనే దృష్టి కేంద్రీకరించినా గత ఏడాదిగా కేవలం గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకునే వివిధ సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలు అటు పట్టణాలకూ, ఇటు గ్రామాలకూ కూడా లబ్ధి చేకూర్చేవే. అయితే కేవలం గ్రామాలనే దృష్టిలో ఉంచుకుని రూపొందించిన చేపల పెంపకం, గొర్రెల పెంపకం వంటి పథకాలతోపాటు రెండు పంటలకూ ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇవ్వాలన్న కీలక నిర్ణయమూ వచ్చే రెండు మూడేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగమే. గొర్రెల పెంపకం వంటి పథకాలను కొన్ని పార్టీలు చిన్న చూపు చూస్తున్నా దీని వెనక టిఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం కూడా ఉంది. వచ్చే రెండేళ్లలో రాష్టవ్య్రాప్తంగా నాలుగు లక్షల యాదవ, కురుమ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలన్న లక్ష్యం నెరవేరితే టిఆర్‌ఎస్ ఓటుబ్యాంకుకు ఢోకా ఉండదు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 75శాతం సబ్సిడీతో 20 గొర్రెలను అందజేస్తారు. చేపల పెంపకం వెనుకా ఉద్దేశమిదే. చేనేత కార్మికుల సంక్షేమం, ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రెండు మూడేళ్లలో గ్రామాల స్వరూపమే పూర్తిగా మారిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఆర్థికంగా తెలంగాణకు ఉపయోగపడడంతో పాటు రాజకీయంగా టిఆర్‌ఎస్ మరింత బలపడేందుకు ఉపయోగపడుతుందని టిఆర్‌ఎస్ అధినేత అంచనా.