ఆంధ్రప్రదేశ్‌

అగ్నిగుండంలా మారిన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 23: జార్ఖండ్ నుంచి ఒడిశా, కోస్తాంధ్రా మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ హెచ్చ రిక కేంద్రం ఆదివారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఈ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో వడగాల్పులు వీస్తాయని తెలియజేసింది. ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆదివారం సాధారణం కంటే ఐదు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంగోలులో 45 డిగ్రీలు, తిరుపతిలో 44, కావలిలో 42, నందిగామలో 43, నెల్లూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 36, మచిలీపట్నంలో 36, నర్సాపూర్‌లో 35, తునిలో 39, బాపట్లలో 37, కళింగపట్నంలో 34 డిగ్రీలు, విజయవాడలో 42, అనంతపూర్‌లో 42, కడపలో 43, కర్నూలు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు.