తెలంగాణ

రెండేళ్లలో 2లక్షల ఇళ్లు కడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పటం తేలికే.. చేయటమే కష్టం: సిఎంపై దత్తాత్రేయ విమర్శ
దేశంలో పది లక్షల ఇళ్లు కడతాం
రాష్ట్రాలు తక్కువ ధరకు భూమి ఇవ్వాలి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు పరీక్షా సమయమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మాటలు చెప్పడం, హామీలు ఇవ్వడం సులభం...ఆచరణ అసాధ్యం అని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. 2.30 లక్షల రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటి వరకు 1700 ఇండ్లు మాత్రమే పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఇంకో రెండేళ్ళలో 2 లక్షల 28 వేల ఇండ్లు నిర్మించి ఇవ్వడం సాధ్యమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. పైగా హడ్కో ద్వారా 9 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని, ఆ లెక్కన కోటి ఎకరాలకు నీరు అందించనున్నట్లు హామీ ఇచ్చి, చివరకు 5 లక్షల ఎకరాలకే నీరు ఇచ్చారని, ఇంకా 95 లక్షల ఎకరాలకు రాబోయే రెండేళ్ళలో నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ప్రోగ్రెస్ రిపోర్టు..
మూడేళ్ళలో తాను చేసిన పనులపై వచ్చే నెలలో ప్రజల ముందు రిపోర్టు పెడతానని దత్తాత్రేయ తెలిపారు. తమ ప్రభుత్వంలోని మంత్రులందరూ నివేదిక ఇస్తారని చెప్పారు.
గ్రూపు ఇన్సురెన్స్ హౌసింగ్..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులందరికీ గ్రూపు ఇన్స్యూరెన్స్ హౌసింగ్ పథకాన్ని అమలు చేసి రానున్న రెండేళ్ళలో 10 లక్షల గృహాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని కలలు కన్నట్లు 2022 నాటి అందరికీ గృహవసతి కల్పించాలన్న ఉద్దేశ్యంతో సభ్యులందరికీ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా గృహాలను నిర్మిస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, హడ్కోలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలా ముందుకు వస్తే మరిన్ని గృహాలు మంజూరు చేస్తామన్నారు. ఆ విధంగా ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద 2.2లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గృహాలు నిర్మించుకునే ఇపిఎఫ్‌ఓ సభ్యులందరికీ 90శాతం మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ సామర్థ్యం పెంచడానికి పలు సంస్కరణలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
కార్మికుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలూ తీసుకుని వస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని 4.10కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా 2016-17 సంవత్సరానికి వడ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఇతర పొదుపు పథకాల్లో వడ్డీ రేటు తగ్గినప్పటికీ, ఇపిఎఫ్ సభ్యులకు మాత్రం 8.65 శాతం వడ్డీగా నిర్ణయించామన్నారు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో 21,559కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఈ ఏడాది మార్చి 31నాటికి మార్కెట్ విలువ 23,845 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. కాగా స్టాక్ మార్కెట్లలో ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడులపై అధ్యయనం చేసేందుకు ఆయా దేశాలకు నిపుణులతో కూడిన బృందాలను పంపించే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

వౌలిక వసతుల
కల్పనలో విఫలం
టిఆర్‌ఎస్ అండతో
ఇసుక మాఫియా స్వైరవిహారం
విహెచ్ విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రజలకు వౌళిక సదుపాయాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎఐసిసి కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అవస్థలు పడుతుంటే, గర్భవతులు మృత్యువాత పడుతుంటే ప్లీనరీ సంబరాల్లో మంత్రులు, నేతలు మునిగి తేలుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసి రిజర్వేషన్లను రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం సరికాదని అన్నారు.
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫీయా ఖమ్మం జిల్లా గోదావరి నదీ ప్రాంతంలో రెచ్చిపోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు సమస్యను పరిష్కరించే స్థితిలో సిఎం కెసిఆర్ లేరని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాద్రి రామయ్యకు చెందిన భూములన్నీ నీట మునుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు.

ప్రజలకు ఉచిత
న్యాయ సలహా
లీగల్‌సర్వీసెస్ ప్యానల్ లాయర్లకు శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజలకు అవసరమైన పక్షంలో న్యాయసలహా ఇచ్చేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటి ప్యానల్ లాయర్స్‌ను నియమించింది. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు పాత జిల్లా కేంద్రాల్లో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పాత జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, జోగులాంబ, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లోని వివిధ కోర్టులలో పనిచేసేందుకు ఎంపికైన లీగల్ సర్వీసెస్ ప్యానెల్ లాయర్స్‌కు ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణా కార్యక్రమం ఆదివారం పూర్తయింది. ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, మహబూబ్‌నగర్ జిల్లా లీగల్‌సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి. వెంకట కృష్ణయ్య ఫస్ట్ అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి సి. హరికృష్ణ భూపతి, ఫ్యామిలీకోర్ట్ జడ్జి రాధాదేవి, సబ్‌జడ్జి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ప్యానెల్ లాయర్స్‌కు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇచ్చారు. గ్రూప్ చర్చలు, చట్టాలపై క్విజ్ తదితర అంశాలు కూడా చేపట్టారు. శిక్షణ పూర్తయిన ప్యానెల్ లాయర్స్‌కు సర్ట్ఫికెట్లు అందించారు. ప్యానెల్ లాయర్స్ న్యాయసలహా అవసరమైన ప్రజలకు లీగర్ సర్సీసెస్ తరఫున ఉచితంగా న్యాయసలహా ఇస్తారు.
ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని లీగల్ సర్వీసెస్ అథారిటి ప్రకటించింది.

ప్యానెల్ లాయర్స్‌కు సర్ట్ఫికెట్లు అందిస్తున్న దృశ్యం

ప్రజల ప్రశ్నలకు జవాబేది?
టిజెఎసి శిక్షణ తరగతుల్లో ప్రొఫెసర్ కోదండరామ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పడం లేదని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ విమర్శించారు. పోరాడి సాదించిన ప్రజలకు పాలనలో భాగస్వామ్యం లభించడం లేదన్నారు. నగర శివారులోని ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు 31 జిల్లాల నుంచి టి.జెఎసి ఆఫీసు బేరర్లు వచ్చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధులకు నిర్ణయాధికారం లేకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసినందుకు, టి.జెఎసి బాధ్యులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాల్సిన అవసరం ఉందని, అయితే ఆ దిశగా పని చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత విద్య పొందుతారని అనుకున్నామని, అయితే ఉపాధ్యాయ ఖాళీలనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆయన అన్నారు. విశ్వ విద్యాలయాలు పతనం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం కొంత పని చేసినప్పటికీ, ఆసుపత్రులకు సరైన నిధులు కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. సాగు నీటి రంగం రోజు రోజుకీ సంక్షోభంలో కూరుకుపోతున్నదని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. చిన్న రైతులను బతికించే సమగ్ర వ్యవసాయ విధానం ప్రభుత్వం వద్ద లేదని ఆయన విమర్శించారు. కృష్ణా-గోదావరి నదులపై ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టులు ప్రజల కోసమా?, సీమాంధ్ర కాంట్రాక్టర్ల కోసమా? అని ఆయన ప్రశ్నించారు.

కానిస్టేబుల్ అభ్యర్థులకు
మే 1నుంచి శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: స్టైపెండరీ క్యాడెట్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థులకు మే ఒకటో తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని ఇన్స్‌పెక్టర్ ఆఫ్ జనరల్ (శిక్షణ) చారు సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు యూనిట్ అధికారులకు ఈనెల 28వ, తేదీ ఉదయం గం. 10:00లకు రిపోర్ట్ చేయాలని, 30వ, తేదీ ఉదయం గం. 8:00లకు కేటాయించిన శిక్షణ కేంద్రాలలో రిపోర్ట్ చేసేందుకు యూనిట్ అధికారులు పంపుతారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు శిక్షణ కేంద్రంలో రిపోర్టింగ్ చేసేటప్పుడు మెస్, ఇతర చార్జీలకు రూ. 6000లు జమ చేయాలని (మెస్ చార్జీలు శిక్షణ అనంతరం వాపసు చేయబడతాయి) వారి వెంట రెండు ఖాఖీ నిక్కర్లు, రెండు చిన్న చేతుల తెల్ల బనియన్లు, ప్లాస్టిక్ బకెట్, మగ్, బూట్ పాలిష్, బూట్ బ్రష్, ఒక జత తాళం, దిండు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఆరోగ్య భద్రత కార్డు కొరకు 10 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని సిన్హా కోరారు. శిక్షణ కేంద్రానికి అభ్యర్థులు వారి వెంట విలువైన వస్తువులు తేవద్దని పేర్కొన్నారు.
ప్రొటోకాల్ పాటించరా?
మేడే వేడుకలకు దత్తాత్రేయను
పిలవకపోవటం దారుణం
బిజెపి ఎమ్మెల్సీ రామచందర్‌రావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రొటోకాల్ పాటించడం లేదని బిజెపి ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల దినోత్సవమైన ‘మే-డే’ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఆహ్వానించకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. మే-డే ఉత్సవాల్లో కేంద్రమంత్రి లేకపోవడం పట్ల ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఎంపీగా ఆహ్వానించడం లేదని, కేంద్ర మంత్రిగా ఆహ్వానించడం లేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకూ ఆహ్వానించకుండా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ కావాలనే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే తాము ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేపడతామని రామచందర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దక్షిణాదిలో
నల్లగొండ, ఖమ్మం టాప్
కొనసాగుతున్న వేడిగాడ్పులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత దక్షిణాదిరాష్ట్రాల్లో టాప్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం తమిళనాడు, పాండిచ్చెరి, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, లక్షద్వీపాలలో నమోదైన ఉష్ణోగ్రతలకంటే నల్లగొండ, ఖమ్మలలో నమోదైన ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైందని ఐఎండి రీజనల్ సైంటిస్ట్ ‘డి’ సిఎస్ పతి పేర్కొన్నారు. తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అక్కడక్కడా చిన్నపాటి వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడా వర్షం కురవలేదని వివరించారు. సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సాధారణం కంటే 2 లేదా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి.