తెలంగాణ

ప్రశ్నార్థకంగా ప్రాజెక్టులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: భూసేకరణ చట్టానికి ఇంకా రాష్టప్రతి ముద్ర పడకపోవడంతో రాష్ట్రంలో భూసేకరణ సమస్యగా మారే అవకాశం ఉంది. రెండున్నర నెలల క్రితం అసెంబ్లీలో ఆమోదం తరువాత గవర్నర్ సంతకం కూడా అయిపోయింది. చట్టం అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్టప్రతి నుంచి తక్షణం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేంద్రంలో ప్రయత్నాలు కూడా జరిపింది. అయితే ఇప్పటికీ రాష్టప్రతి ఆమోద ముద్ర పడలేదు. భూ సేకరణపై రెండు నెలల క్రితం జిల్లా అధికారులకు ముసాయిదా బిల్లు పంపించి, కార్యదర్శి ఎస్‌పి సింగ్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే చట్టం వస్తుంది, దీని ప్రకారం భూసేకరణ పనులు ప్రారంభించండి అని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఎలాంటి కదలిక లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి భూసేకరణ చట్టం గురించి తీసుకు వెళ్లారు. న్యాయశాఖ తరఫున ఫైల్ క్లియర్ అయిందని, రాష్టప్రతి ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ప్రాజెక్టులను సత్వరం నిర్మించాలనే ఉద్దేశంతో బడ్జెట్‌లో ఏటా 25వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారంలో భూ సేకరణ వివాదాస్పదంగా మారింది.
తొలుత జీవో 123 ప్రకారం చాలా వేగంగా భూసేకరణ జరిపారు. జీవో 123ని కోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు వచ్చింది. యుపిఏ ప్రభుత్వం రూపొందించిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా భూ సేకరణ జరపలేదని మంత్రులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 భూ సేకరణ చట్టాన్ని సవరించి కొత్త చట్టం తీసుకు వచ్చారు. అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదం చక చకా జరిగిపోయినా, ఢిల్లీలో బ్రేకు పడింది.
సవరణల కోసం కేంద్రంతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూ సేకరణ చట్టాలు, పునరావాస ప్యాకేజీలను పరిశీలించిన తరువాత కొత్త చట్టం రూపొందించినట్టు అధికారులు తెలిపారు. రాష్టప్రతి ఆమోద ముద్రకు ఎంత ఆలస్యం అయితే భూ సేకరణకు ఆంత మేరకు ఆలస్యం అవుతుందని, దీని వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీలో సోమవారం కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌తో భేటీ అయన సిఎం కెసిఆర్