తెలంగాణ

అభాగ్యులకు ‘బడుగుల’ గొడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 26: మానసికంగా, శారీరకంగా కృంగి, కృశించి పోతున్న మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి కొత్త వెలుగులు ప్రసాదించడానికి మెదక్ పోలీసులు అమలు పరుస్తున్న ‘చేతన’ కార్యక్రమం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. అత్తింటి ఆరళ్లు, భర్తల వేధింపులు, ఆకతాయి చేష్టలతో యువతులు, వివాహిత మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితంపై విరక్తి పుట్టి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్న వారిపట్ల చేతన చైతన్య కేంద్రలు అదిలోనే మంచి విజయాలను సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్రామీణ ప్రాంతానికి చెందిన స్ర్తిలు ఎదుర్కొనే వివిధ రకాల ఇబ్బందులను సాటి మహిళగా గుర్తించిన మెదక్ ఎస్పీ బడుగుల సుమతి మదిలో మేళవించిన ఆలోచనకు విశ్రాంత ఉపాధ్యాయులు సాధిస్తున్న విజయాలు అమోఘమని చెప్పవచ్చు. వివిధ రకాల వేధింపులతో ఆత్మహత్యలే శరణ్యమనుకున్న ఎంతో మంది మహిళలకు పునర్జన్మ కల్పించిన అనేక కేసులున్నాయి. పేర్లను బయటకు చెప్పలేని ఎంతో మంది మహిళల దీనగాథలకు మోక్షం లభించిన తీరు వింటే అవునా అని ఆశ్చర్యపోవాల్సిందే. నిమ్స్ ఆసుపత్రిలో అదనపు ప్రొఫెసర్‌గా పని చేస్తున్న న్యూరో సైకాలజిస్టు డాక్టర్ సువర్ణ అల్లాడి స్ఫూర్తితో చేతన కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఎస్పీ వివరించారు. అభాగ్యురాళ్లను ఆదుకోవడానికి 2015 ఆగస్టు 8వ తేదీన చేతన అనే నామకరణంతో పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో ఉన్న గీతం విశ్వ విద్యాలయంలో సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 14 చేతన కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓల పర్యక్షణలో కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. సున్నిత మనస్కులైన చిన్నారులకు పాఠాలు బోదించి వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో గుర్తించిన ఎస్పీ సుమతి విశ్రాంత ఉపాధ్యాయులకు అవగాహన కేంద్రా ల బాధ్యతను అప్పగించారు.