తెలంగాణ

రేపు ఇఫ్లూ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) సెంట్రల్ యూనివర్శిటీ హోదాలో తొలి స్నాతకోత్సవాన్ని 26న నిర్వహించుకోబోతోంది. ఈ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్నారు. స్నాతకోత్సవ ఉపన్యాసం కూడా చేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 1958లో స్థాపితమైన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు స్థాయిని 1972లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్)కి పెంచారు. తర్వాత సీఫెల్ 1973లో షిల్లాంగ్, 1979లో లక్నోల్లో కేంద్రాలను ప్రారంభించింది. 1973లోనే సీఫెల్ డీమ్డ్ యూనివర్శిటీ హోదా పొందగా, 2007లో సెంట్రల్ యూనివర్శిటీ హోదా పొందింది. 2016లో వచ్చిన నేక్ బృందం ఇఫ్లూకు ఏ గ్రేడ్‌ను ఇచ్చింది. స్నాతకోత్సవంలో 8 మందికి బంగారు పతకాలు, 69 మందికి పిహెచ్‌డిలు, 108 మందికి మాస్టర్ డిగ్రీలు, ఆరుగురికి పిజిడిటిఇ, 72 మందికి స్నాతకోత్సవ డిగ్రీలు అందజేస్తారు. స్నాతకోత్సవం గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరుగుతుందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సునయిన సింగ్ చెప్పారు. తొలి స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు.
నేడు గోవాకు రాష్టప్రతి
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 25వ తేదీన గోవా యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి 26వ తేదీన హైదరాబాద్‌కు వస్తారు. మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్శిటీ శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.