తెలంగాణ

‘గ్రేటర్’ ప్రజలకు తీరని దాహార్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని ప్రజలకు ప్రతి రోజూ నీటి సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మారోసారి వాయిదా పడింది. నగర ప్రజలకు రోజూ నీరు విడుదల చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు పలు సార్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి వర్షాలు సకాలంలో కురిస్తేనే సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా, గోదావరి జలాలు ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఏమీ లేవని, రోజూ విడుదల చేయడానికి సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు. 2008 సంవత్సరంలో రోజూ నీటి సరఫరా చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా గంట నుంచి గంటన్నర మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. నగర శివారులోని నాచారం లాంటి కొన్ని ప్రాంతాలకు నాలుగు రోజులకోసారి నీటిని విడుదల చేస్తుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం నీరు వస్తుందంటూ భోలక్‌పూర్ వాసులు ఆందోళన చేపట్టడంతో అధికారులు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు చేపట్టారు. కాగా, నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు, అనేక బస్తీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు, నెలాఖరుకు ఈ ట్యాంకర్ల సంఖ్యను 750కి పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నా రు. మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కృష్ణా నదీ మూడు దశల నుంచి 256 మిలియన్ గ్యాలన్ల నీటిని, గోదావరి మొదటి దశ ఎల్లంపల్లి నుంచి 108 మిలియన్ గ్యాలన్న నీటిని మళ్లిస్తున్నారు. మహా నగరంలో 9.8 లక్షల నల్లా కనెక్షన్లు అధికారికంగా ఉన్నాయి. నాగార్జున సాగర్ జలాశాయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 505.900 అడుగులు ఉంది. ఈ జలాశయం నీటి మట్టం 504 అడుగుల కంటే దిగువకు పడిపోయినట్లయితే అత్యవసరంగా పంపింగ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
నెలాఖరు నుంచి పంపింగ్ చేయాల్సి వస్తుందేమోనని అధికారులు అంఛనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టంగండి వద్ద 10 భారీ మోటార్లతో నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో 256 మిలియన్ గ్యాలన్న నీటిని అక్కంపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేయాలని భావిస్తున్నారు.
నీటి లభ్యత ఎంత?
ఇలాఉండగా గత ఏడాది భారీగా కురిసిన వర్షాలతో జలాశయాలు జలకళ సంతరించకున్నాయి. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి రోజూ 602 మిలియన్ గ్యాలన్ల నీటిని మహానగరానికి తరలించేందుకు అవకాశం ఉన్నా, కేవలం 392 ఎంజిడిల నీటిని మళ్లిస్తున్నారు. కృష్ణా, గోదావరి నుంచి 410 మిలియన్ గ్యాలన్లకు ఇబ్బంది లేదు. ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా 56 రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. వాసవీనగర్, కెపిహెచ్‌బి ఫేజ్-4, హుడా మియాపూర్, ఆటోనగర్ స్టోరేజీ రిజర్వాయర్ ఇలా మహా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించే రిజర్వాయర్లలో నీటి నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 12 నెలల సమయంలో 12 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు నిర్మించారు. మల్కాజిగిరిలో మరో మూడు, సనత్‌నగర్, హుస్సేన్ సాగర్, మారేడ్‌పల్లి ప్రాంతాల్లోనూ రిజర్వాయర్లు సిద్ధమవుతున్నాయి.
ఏ జలాశయం నుంచి ఎంతంటే..
మహానగరానికి నీరు అందించేందుకు జలమండలి ఈ జలాశయాల నుంచి నీటిని మళ్లిస్తున్నది. సింగూరు నుంచి 75 ఎంజిడి, మంజీరా నుంచి 30 ఎంజిడి, అక్కంపల్లి నుంచి 226 ఎంజిడి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 56 ఎంజిడిల నీటిని మళ్లిస్తున్నారు. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసి జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉన్నట్లయితే సెప్టెంబర్ నుంచి ప్రతి రోజూ నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.