తెలంగాణ

ఆరు వేల కోట్ల నష్టంలో ‘పోస్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తపాలా కార్యాలయాల్లో
నగదు రహిత లావాదేవీలు
పైలట్ ప్రాజెక్టుగా
హైదరాబాద్ జిపిఓలో అమలు
సెప్టెంబర్ నుంచి
పోస్ట్ఫాసుల ద్వారా ఆధార్ కార్డులు
కార్యదర్శి బివి సుధాకర్

హైదరాబాద్, ఏప్రిల్ 24: పోస్టల్ శాఖ (పోస్ట్) 2015-16లో ఆరువేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ కార్యదర్శి బివి సుధాకర్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 2015-16లో తమ శాఖ ఆదాయం 13 వేల కోట్ల రూపాయలు కాగా, ఖర్చు 19 వేల కోట్ల రూపాయలన్నారు. 2017లో పేకమిషన్ సిఫార్సులను అమలు చేయడం తదితర కారణాల వల్ల ఖర్చు మరింత పెరుగుతుందని వెల్లడించారు. పోస్టల్ శాఖ కొన్ని సంవత్సరాల నుండి నష్టాల్లోనే కొనసాగుతోందని, ఈ నష్టాలను పూరించేందుకు స్పీడ్‌పోస్ట్ సహా అనేక వినూత్న చర్యలు చేపట్టామని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని, నష్టం మొత్తం క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు.
ఆధార్ ఆధారిత సేవలను (డిజిటల్ ట్రాన్జాక్షన్స్) అందించేందుకు నిర్ణయించామని, పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్ జిపిఓ (జనరల్ పోస్ట్ఫాస్)లో ఈ సేవలను ఈరోజే ప్రారంభించామని సుధాకర్ తెలిపారు. పోస్ట్ఫాస్‌కు వచ్చే వినియోగదారుడు 20 రూపాయలో, 50 రూపాయలో పోస్ట్ఫాస్‌లో చెల్లించాల్సి వస్తే, సదరు వినియోగదారుడు క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ ఆధార్ కార్డు ఇస్తే వారి అకౌంట్ నుండి పోస్టల్ అకౌంట్‌కు ఆన్‌లైన్ ద్వారా డబ్బు జమ చేసుకుంటామన్నారు. అంటే వినియోగదారుడు పోస్ట్ఫాసుకు నగదు తీసుకు రావలసిన అవసరం లేదన్నారు. ఎపి టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముందుగా దేశంలోని నాలుగువైపులా ఉన్న నాలుగు ప్రధాన పోస్ట్ఫాసుల్లో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తామన్నారు. ఈ సౌకర్యాన్ని దేశంలోని అన్ని పోస్ట్ఫాసులకు త్వరలోనే విస్తరిస్తామన్నారు. 2017 సెప్టెంబర్ నుండి పోస్ట్ఫాసుల ద్వారా ఆధార్ కార్డులు ఇస్తామని, ఈ మేరకు సంబంధిత సంస్థ (యుఐడిఎఐ)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
ఇలా ఉండగా దేశంలోని 4,500 ప్రధాన పోస్ట్ఫాసుల ఆవరణల్లో వివిధ బ్యాంకులు ఎటిఎంలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నామని, లావాదేవీల ప్రకారం పోస్టల్ శాఖకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెల రోజుల్లోగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తామన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపిపిబి) ఇతర బ్యాంకులతో ఇందుకోసం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఐపిపిబిలను ప్రారంభిస్తామన్నారు. దేశవ్యాప్తంగా తమ శాఖ 978 ఎటిఎంలను ఏర్పాటు చేసిందని, అన్ని బ్యాంకుల కార్డులను కూడా ఈ ఎటిఎంలలో ఉపయోగించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీలపై పోస్టల్ బ్యాంకులు స్పష్టమైన ప్రభావం చూపిస్తాయన్నారు.
ఏడు లక్షల కోట్ల డిపాజిట్లు
దేశవ్యాప్తంగా 2014-15లో 33.03 కోట్ల అకౌంట్లు ఉండగా, 2016-17 నాటికి ఈ సంఖ్య 35.17 కోట్లకు పెరిగిందని బివి సుధాకర్ తెలిపారు. ఈ అకౌంట్లలో ఏడు లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా జమ అయ్యాయని వివరించారు.