తెలంగాణ

సాహో.. ఉస్మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రారంభించనున్న రాష్టప్రతి నిఘా నీడలో వర్శిటీ క్యాంపస్
1500 సిసి కెమెరాలు ఏర్పాటు ప్రత్యేక కమెండోలతో భద్రత
ప్రధాన వేదిక వద్ద అన్నీ నిషేధమే వర్శిటీలో 3 అధ్యయన కేంద్రాలు
శతాబ్దివనం ఏర్పాటుకు ప్రతిపాదన ఓయులో జీవ వైవిధ్య పార్కు

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబయింది. నాలుగైదు నెలల నుంచే ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నా, ఏడాదిపాటు జరిగే శతాబ్ది ఉత్సవాలను బుధవారం మధ్యాహ్నం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉస్మానియా వర్శిటీ నిఘా నీడలోకి వెళ్లిపోయింది. మంగళవారం నుంచి కట్టుదిట్టమైన బందోబస్తుతో పోలీసులు దిగ్బంధం చేశారు. విద్యార్థుల కదలికలు, ఇతరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాన కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపుకార్డులను జారీ చేశారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు, ఆహ్వానపత్రాలు అందుకున్న వారు యూనివర్శిటీ ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్‌లో గుర్తింపుకార్డు పొందాల్సి ఉంటుంది. తొలుత ఆధార్ నెంబర్ ఆధారంగా వేలిముద్రలతో సరిపోల్చుకున్న తర్వాతనే అతిథులను అనుమతించాలని యూనివర్శిటీ పెద్దలు భావించినా, తర్వాత నిబంధనలను సడలించారు. మండుటెండలో మధ్యాహ్నం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో జరిగే కార్యక్రమానికి వచ్చే పెద్దలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా వేదికపై 7.5 టన్నుల సామర్థ్యం ఉండే 15 ఏసీలను ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో రెండు వేల టన్నుల సామర్థ్యమున్న ఏసీలను నెలకొల్పారు. ప్రధాన వేదిక వద్దకొచ్చేవారు సెల్‌ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లు, నల్లరంగు నిరసన పతాకాలు, గొడుగులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, ఆయుధాలు తీసుకురావడాన్ని నిషేధించారు. ఉదయం 11కే వేదికవద్దకు అంతా చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గోవా నుంచి నేరుగా హైదరాబాద్ బేగంపేటకు ప్రత్యేక విమానంలో చేరుకునే రాష్టప్రతి అక్కడి నుంచి శత జయంత్యుత్సవాలు నిర్వహించే వేదికకు ప్రత్యేక కాన్వాయిలో
వస్తారు. ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేస్తారు. రాష్టప్రతి రాక సందర్భంగా దాదాపు వెయ్యిమంది పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన కమెండోలు, టాస్క్ఫోర్సు, ఐబి సిబ్బందిని రంగంలోకి దించారు.
15నిమిషాలు రాష్టప్రతి ప్రసంగం
మూడు రోజులపాటు జరిగే శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో తొలిరోజు బుధవారం 12.30 నుంచి 1.30 వరకూ అధికారిక కార్యక్రమం జరుగుతుంది. ఇందులో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, జిహెచ్‌ఎంసి మేయర్ డాక్టర్ బొంతు రమేష్, విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం సహా వర్శిటీ అధికారులు పాల్గొంటారు. 12.30కి రాష్టప్రతి వేదిక వద్దకు చేరుకుంటారు. విసి, రిజిస్ట్రార్‌లు ఆయనకు ఘనస్వాగతం పలికిన అనంతరం వేదికపైకి తీసుకొస్తారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలవుతుంది. రాష్టప్రతి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. విసి స్వాగతోపన్యాసం చేసిన తర్వాత వేదికపై ఉన్న ప్రముఖులకు సత్కారం జరుగుతుంది. అనంతరం ఎంపి కె కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సిఎం కె చంద్రశేఖరరావులు ఉపన్యసిస్తారు. హిస్టరీ ఆఫ్ ఉస్మానియా అనే ఆంగ్ల గ్రంథం, సుగాత్ పేరిట ఉర్దూలో ముద్రించిన గ్రంథాన్ని, వందేళ్ల ఉస్మానియా పేరుతో తెలుగులో ఓయు ముద్రించిన గ్రంథాలను రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించి తొలి ప్రతులను రాష్టప్రతికి అందిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. చివరికి రాష్టప్రతి 15 నిమిషాలపాటు మాట్లాడతారు.
శతాబ్ది వనం
ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు గుర్తుండిపోయేలా అనేక చర్యలు చేపడుతోంది. అందులో ప్రధానంగా మూడు అధ్యయన కేంద్రాలు నెలకొల్పనుంది. తెలంగాణ అధ్యయన కేంద్రం, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, జీవవైవిధ్య పరిరక్షణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వీటితోపాటు సౌరవిద్యుత్ ప్లాంట్, ఘనవ్యర్ధ పదార్ధాల యాజమాన్యం, జీవవైవిధ్య పార్కు ఏర్పాటుతో పాటు శతాబ్ది వనాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రధాన వేదికకు 2వేల మందికి ఆహ్వానాలు
ప్రధాన వేదిక వద్దకు హాజరుకావల్సిందిగా 2వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరితోపాటు విఐపి కార్డులు, కస్టమ్ కార్డులు, ప్లాటినం కార్డులు, గోల్డు కార్డులు, సెంటినరీ కార్డులు పొందిన వారు, పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్థులకు సైతం అనుమతి పత్రాలు జారీ చేశారు. రాష్టప్రతి కార్యక్రమం వినా మిగిలిన ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు ఆంక్షలు విధించలేదు. దాంతో స్వేచ్ఛగా ఎవరైనా పాల్గొనే వీలు కలిగింది.