తెలంగాణ

రాష్టప్రతి ఉండేది 6 గంటలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు ఆరు గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు. రాష్టప్రతి రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు సాయంత్రం ఇఫ్లూ యూనివర్శిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గోవా నుండి ప్రత్యేక విమానంలో రాష్టప్రతి బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 నుండి 1.30 గంటల వరకూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30కి ఉస్మానియా నుండి బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు అక్కడే ఆయన మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, ప్రముఖులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రులు రాష్టప్రతితో భేటీ కానున్నట్టు తెలిసింది. ఉభయ రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి గవర్నర్ నరసింహన్ రాష్టప్రతికి వివరించనున్నారు. నాలుగు గంటలకు రాజ్‌భవన్ నుండి బయలుదేరి గచ్చిబౌలి బ్రహ్మకుమారీల శాంతి సరోవర్ ఆడిటోరియంకు వెళ్తారు. రాజ్‌భవన్, కెసిపి జంక్షన్, హోటల్ తాజ్‌కృష్ణ, మాసాబ్ ట్యాంక్, ఎన్‌ఎండిసి, రేతిబౌలి, టోలిచౌక్, షేక్‌పేట మీదుగా గచ్చిబౌలికి వెళ్తారు. సమావేశం ముగిసిన వెంటనే బేగంపేటకు 6.20 గంటలకు చేరుకుని న్యూఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. దీంతో నగరంలో అత్యంతకీలకమైన రద్దీరహదార్లను పోలీసులు మూసివేయనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల దారిమళ్లిస్తున్నారు.