తెలంగాణ

అన్ని వాహనాలూ అక్కడికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లో 27న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు పార్టీ నాయకత్వం విస్తృత రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసింది. బహిరంగ సభకు 10 లక్షలకుపైగా జనాలను తరలించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఆ మేరకు అవసరమైన, అన్ని రకాల రవాణా సదుపాయాలను వినియోగించుకుంటోంది. ఖమ్మం జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసారు. కొత్తగూడెం నుంచి ఒక రైలు, మధిర నుంచి మరొక ప్రత్యేక రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండుగంటలకు కాజీపేట చేరేలా ఏర్పాట్లు చేసారు. బహిరంగ సభ అనంతరం తిరిగి ఈ రైళ్లు తిరిగి బయలుదేరి నిర్ణీత ప్రాంతాలకు చేరుకుంటాయి. కొత్తగూడెం, మధిరల నుంచి వరంగల్ వరకు మార్గమధ్యంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో తెరాస శ్రేణులను, ప్రజలను ఈ రైళ్లలో ఆవిర్భావ బహిరంగ సభకు తరలించేందుకు ఖమ్మం జిల్లా తెరాస నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కాజీపేటకు కూడా ఒక ప్రత్యేక రైలు నడిపేలా రాష్ట్ర టిఆర్‌ఎస్ అగ్రనాయకులు దక్షిణమధ్య రైల్వే అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోపక్క రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి అత్యధిక బస్సులను అద్దెకు తీసుకుని వివిధ రూట్ల నుంచి ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాలలో అద్దె కార్లు, జీపులు, సుమోలు, టాటా-ఎస్ తదితర వాహనాలను కూడా వరంగల్ బహిరంగ సభకు తరలించేందుకు సిద్ధం చేసారు. బహిరంగ సభ జరిగే వరంగల్ నగరం సమీపంలోని అన్ని గ్రామాల నుంచి జనాలను తరలించేందుకు సెవన్ సీటర్, త్రీ సీటర్ ఆటోలను కేటాయించారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు వందలాది ట్రాక్టర్లలో వరంగల్ తరలించేందుకు అక్కడ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఇక జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఎడ్లబండ్ల ద్వారా జనాలను వరంగల్ బహిరంగ సభకు తరలించే ఏర్పాట్లు చేసారు.
వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగులు
కాగా ఆయా జిల్లాల నుంచి భారీసంఖ్యలో తరలివచ్చే వాహనాల కోసం బహిరంగ సభ జరిగే ప్రకాష్‌రెడ్డిపేటకు చుట్టుపక్కలా తొమ్మిది పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాలతోపాటు జనగామ జిల్లా నుంచి వచ్చే వాహనాలకు మూడు పార్కింగ్ కేంద్రాలను కేటాయించారు.
అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు సిద్దిపేట, భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు మరో మూడు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. బహిరంగ సభకు తరలి వచ్చే ట్రాక్టర్ల కోసం ఏడవ నెంబరు పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. వరంగల్ తూర్పు, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వాహనాల కోసం ప్రత్యేకంగా ఎనిమిదవ నెంబరు పార్కింగ్ స్థలాన్ని, అన్ని ద్విచక్ర వాహనాల కోసం తొమ్మిదవ నెంబరు పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు.

స్వాగత తోరణాలతో తెరాస బహిరంగభ జరిగే ప్రాంతానికి ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు