తెలంగాణ

అవినీతిని ఎండగట్టడమే మా విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 25: సాధించుకున్న స్వరాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి ఫలాలన్నీ తెలంగాణ ప్రజలకు దక్కాలని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా టిజెఎసి మండలాల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక శివనగర్ ఆలయ కమ్యూనిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ అవినీతిని అరికట్టే ప్రయత్నం చేయాలని, జెఎసిగా తమ పని విధానంపై స్పష్టత ఉందన్నారు. ప్రభుత్వ విధానాలను ఎలా చూడాలి అనే దాని పై ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టుగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయిలో సదస్సు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అవినీతిని రూపుమాపాలని, దీనిని తీవ్ర విషయంగా గుర్తించాలని, లేనిపక్షంలో అభివృద్ధి జరిగినా కనిపించదన్నారు. ధర్నా చౌక్ అనేది ‘్ధర్మ గంట’ లాంటిదని, అన్యాయం జరిగినపుడు అక్కడికి వెళ్ళి నివేదించుకునే అవకాశం ప్రజలకు ఉంటుందని, ప్రస్తుతం దానిని ప్రభుత్వం తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. పాలకులు ప్రజల బాగోగులు చూడాలని, వారి గురించి ఆలోచన ఉండాలన్నారు. ప్రజలకు జరిగే కష్టాలు, ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేయాలని, అదే తమ ఉద్దేశమని అన్నారు. అభివృద్ధి అంటే హైదరాబాద్ మాత్రే మే కాదని, సిరిసిల్ల జిల్లాను కూడా అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణలో చిన్న సన్న కారు రైతులే అధికంగా ఉన్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి రైతుపై రూ.93 వేల అప్పు ఉన్నదని, దీనిని కేంద్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా తెలిపిందన్నారు. తెలంగాణలో వ్యవసాయం ఎండిపోయిందని, నష్టపరిహారం దొరికే పరిస్థితి లేదన్నారు. ఇవాళ రైతు బతికే పరిస్థితి లేదని, ప్రభుత్వమే రైతులను అన్నివిధాల ఆదుకోవాలన్నారు. ప్రపంచానికి అంతటికి బట్ట నేర్పిన ప్రత్యేకత సిరిసిల్లదని, ముంబై, షోలాపూర్, సూరత్, భీవాండిలలో మన వాళ్ళే ఉంటారని, సిరిసిల్ల ప్రజలు లేకపోతే మరమగ్గాలు నేసేవారు లేరన్నారు. దేశం అంతటికీ బట్టలు నేసే కార్మికులకు ఊర్లో మాత్రం బతుకుతెరువు లేదన్నారు. పవర్‌లూములను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం అనేక అవసరాలకు బట్ట కొంటదని, మంచి ధర ఇచ్చి గుడ్డ కొనాలని, దాని వల్ల యజమానులకు, కార్మికులకు లాభం చేకూరుతుందన్నారు. సిరిసిల్లలో బీడీలు చేసే వారు కూడా ఎక్కు వే ఉన్నారని, కానీ వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదని, ప్రభు త్వ జీవోలు జారీ అయినా అమలుకు నోచుకోని దౌర్భాగ్య స్థితి అన్నారు. ఇప్పటికైనా బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలన్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పాలకులకు వారి తాబేదార్లకు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు, ఆంధ్రా ప్రాంతాలకే దక్కిందని, ఆంధ్రా వారి పెత్తనంలో తెలంగాణ ప్రజలు నలిగి పోయారన్నారు. ఇపుడు అలా కాకుండా జరిగే అభివృద్ధి కూడా ప్రజలకు మేలు చేయాలని, ప్రజలందరికీ గౌరవం దక్కాలని, అనాధలుగా ఉండే పరిస్థితి ఇంకా ఉండరాదన్నారు. స్వరాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు, పాలకుల తాబేదార్లకే అభివృద్ధి ఫలాలు దక్కకుండా ప్రజలందరికీ దక్కాలన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధికి వెళ్ళి ఆగమయ్యే పరిస్థితి పోవాలని, అక్కడికి వెళ్ళే వారికి ప్రభుత్వమే లేఖలు ఇచ్చి అక్కడ ఉద్యోగాలకు పంపాలని, ఏజెంట్ల వ్యవస్థను నియంత్రించాలన్నారు. సిరిసిల్లలో పవర్‌లూం పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక చర్య చేపట్టాలని, ముడి సరకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని, టెక్స్‌టైల్ పార్కులో చిన్న యూనిట్లు మూతపడుతున్నాయని, బ్యాంకులు వేళం వేస్తున్నాయని, వీటిని ప్రభుత్వం అదుకోవాలన్నారు. జీవోలు సవరించి కార్మికులకు కనీస వేతనాలు అందించాలని కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బొజ్జ కనకయ్య, కోకన్వీనర్ బియ్యంకార్ శ్రీనివాస్, జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు మజార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, మాజీ జడ్పీటిసి గొట్టె రుక్మిణి, తిరుమల్‌గౌడ్, కోడె శ్రీనివాస్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం