తెలంగాణ

శ్రమకు తగ్గ్ఫ ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇఎన్‌సి సురేందర్‌రెడ్డికి
దక్కిన జాతీయ పురస్కారం

కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా హడ్కో అవార్డు

గజ్వేల్, ఏప్రిల్ 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ఫలితాలు సాధించడంలో శ్రమించిన గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డికి జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. మంగళవారం దిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రతిష్టాత్మకమైన హడ్కో అవార్డును ఆయన దక్కించుకోవడంతో ఇక్కడి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈఎన్‌సిగా సురేందర్‌రెడ్డి పదవీ కాలం ముగిసినప్పటికీ సిఎం కెసిఆర్ ఆయనపై ఉన్న నమ్మకంతో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించారు. కెసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాహార్తి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మిషన్ భగీరథ పథకంతో స్వచ్ఛమైన తాగునీరును అందించగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 437 మండలాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడంతోపాటు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూసే క్రమంలో రైల్వేశాఖ నుండి 186 అనుమతులు, నేషనల్ హైవే అథారిటీ నుంచి 326 అనుమతులు, ఆర్‌అండ్‌బి శాఖ నుండి 3681 అనుమతులు, పంచాయతీరాజ్ నుంచి 6863 అనుమతులు, కెనాల్ క్రాసింగ్‌లు 1060, నదీ పరివాహక ప్రాంతం వద్ద 46 అనుమతులు సాధించడంలో సురేందర్‌రెడ్డి పాత్ర ఎంతో ఉన్నట్లు సర్కార్‌ప్రకటించిన విషయం తెలిసిందే.

మిషన్ భగీరథ ఈఎన్‌సి సురేందర్‌రెడ్డికి ఢిల్లీలోహడ్కో అవార్డుఅందజేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు