తెలంగాణ

‘కెటిఆర్’ ఇలాఖాలో అవినీతి చీడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 26: రాష్ట్ర పురపాలక, పంచా యతీరాజ్ శాఖల మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎస్‌ఎల్ పథకం (మరుగుదొడ్ల) నిర్మాణాల్లో అవినీతి చీడ పట్టుకుంది. ఆ అక్రమాలపై జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఎట్టకేలకు కొర డా ఝుళిపించారు. బాధ్యులపై చర్యలు చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన ఆర్‌డబ్ల్యూఎస్ డిఇని సస్పెండ్ చేయగా, సర్పంచ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే అక్రమాలపై దృష్టి సారించని మండల అభివృద్ధి అధికారికి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేశారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో, దీనికితోడు వందశాతం మరుగుదొడ్ల నిర్మా ణం పూర్తి చేసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డందుకున్న నియోజవకవర్గ పరిధిలోని గంభీరావుపేట గ్రామంలో ఈ అక్రమాలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎస్‌ఎల్ పథకంలో భాగంగా మండల కేంద్రమైన గంభీరావుపేట గ్రామానికి 834 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, వందశాతం మరుగుదొడ్లు నిర్మించామని 92 లక్షల 62 వేల 277 రూపాయలు డ్రా చేశారు. అయితే, 834లో 263 మరుగుదొడ్లు అసలే నిర్మించలేదని, 23 డబుల్ పేర్లు ఉన్నాయని, ఉపాధి కింద నిర్మించిన ఆరు మరుగుదొడ్లను సైతం ఈ పథకంలో చూపించి డబ్బులు డ్రా చేశారని, గుంతలు తవ్వుకున్న కొంతమందికి రూ.3 వేలు చెల్లించలేదని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నెలరోజుల కిందట రోడ్డెక్కడంతో ఈ అవినీతి భాగోతం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. నిర్మాణాలు చేపట్టకుండా చెల్లింపులు జరిగిన 185 వ్యక్తిగత మరుగుదొడ్ల నిధులను వెంటనే రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతిని ఉపేక్షించేది లేదని, ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.