తెలంగాణ

ఓరుగల్లు గులాబీమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 26: పదహారేళ్లు పూర్తిచేసుకుని 17వ ఏడాదిలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ రాష్టస్రమితి పార్టీ వరంగల్ నగరంలో గురువారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బహిరంగ సభకు జిల్లా టిఆర్‌ఎస్ నాయకత్వం ఏర్పాట్లను పూర్తిచేసింది. సుమారు పదిలక్షల మంది హాజరయ్యే ఈ బహిరంగ సభకు నెలరోజుల నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. తెరాస అధినేత కెసిఆర్ సెంటిమెంట్‌గా, లక్కీ స్థలంగా భావిస్తున్న ప్రకాష్‌రెడ్డిపేటలోని సుమారు మూడువందల ఎకరాల ఖాళీస్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. నేలను చదును చేయడంతోపాటు దుమ్ము రేగకుండా నీళ్లు చల్లడం, అవసరమైన చోట మొరం వేయించడం ద్వారా బహిరంగ సభకు అనుకూలంగా మార్చారు. బహిరంగ సభకు వెళ్లే అన్ని రహదారులకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా కొన్ని రోడ్లను నిర్మించారు. గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయడం, మెటర్‌రోడ్లను తారురోడ్లుగా మార్చటం వంటి పనులు పెద్దఎత్తున చేపట్టారు. బహిరంగ సభాస్థలితోపాటు వివిధ మార్గాల నుంచి బహిరంగ సభ వద్దకు వెళ్లే మార్గాల్లో, పార్కింగ్ స్థలాల్లో శక్తివంతమైన లైట్లను అమర్చారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా ఎన్‌పిడిసిఎల్‌కు చెందిన భారీ జనరేటర్‌ను ఏర్పాటు చేసారు. విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా బహిరంగ సభ స్థలం వద్ద ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు జనరేటర్లు కూడా అమర్చారు. లక్షల సంఖ్యలో జనాలు బహిరంగసభకు హాజరవుతున్న కారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతోపాటు ఇతరుల ప్రసంగాలు స్పష్టంగా వినిపించేలా అత్యాధునిక డిజిటల్ సౌండ్ సిస్టం ఏర్పాటు చేసారు. బహిరంగ సభ జరిగే మైదానంలో పలుచోట్ల భారీ ఎల్‌సిడిలు ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగ సభకు సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో సౌండ్ సిస్టం ఏర్పాటు చేసారు. బహిరంగ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జనాలను వాహనాలలో తరలిస్తున్న కారణంగా వీటి పార్కింగ్ కోసం బహిరంగ సభ జరిగే ప్రాంతానికి చుట్టూ తొమ్మిది పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసారు. ఏ జిల్లా వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియచేస్తూ ఆయా పార్కింగ్ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసారు. బహిరంగ సభ స్థలానికి వెళ్లే మార్గాలను సూచిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు బహిరంగ సభ స్థలానికి సమీపంలోని వివిధ మార్గాలలో బోర్డులు ఏర్పాటు చేసారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్ స్థలాలను సభాస్థలికి అరకిలోమీటరు నుంచి రెండుకిలో మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసారు.
పూర్తయిన వేదిక నిర్మాణం
బహిరంగ సభ ఏర్పాట్లలో భాగం గా గతంలో ఎన్నడూ లేని విధంగా 8400 ఎస్‌ఎఫ్‌టిలతో భారీ వేదిక ఏర్పాటు చేసారు. సుమారు ఐదువందల మంది ఆహ్వానితులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కనే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసారు. వేదిక ముందు విఐపిలు, వివిఐపిల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసారు.
మీడియా కోసం ఐదువందల మంది కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసారు. బహిరంగ సభ సమాచారాన్ని ఎప్పటికపుడు పంపించేలా సభాస్థలి వద్ద వైఫై సౌకర్యంతోపాటు మీడియా కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సామాన్య ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటుచేస్తూ అందులో కొన్నింటిన మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ స్థలంలో ప్రత్యేకమైన పద్ధతుల్లో మైక్‌సిస్టం, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసారు. వేసవి ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో బహిరంగ సభకు వచ్చే జనాలు ఇబ్బందులు పడకుండా బహిరంగసభ ప్రాంతంలో స్ప్రింక్లర్లు ఏర్పాటచేసారు. వీటిద్వారా చల్లటి నీటితుంపర కురిపించి ఎండతీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు తరలివచ్చే జనాల కోసం సభాస్థలి వద్ద 20 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందచేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. వచ్చిపోయే జనాలకు బహిరంగ సభాస్థలి సమీప ప్రాంతాల్లో మంచినీటి కోసం 200 వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచుతున్నారు.
భారీగా కటౌట్ల ఏర్పాటు
కాగా బహిరంగ సభాస్థలి వద్ద 10నుంచి 60 ఫీట్ల కటౌట్లను ఏర్పాటు చేసారు. ఇరువైపులా 30 డిజిటల్ హోర్డింగులను ఏర్పాటు చేసారు. ప్రభుత్వ పథకాలను తెలియపరిచేలా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటయ్యాయి. సభాప్రాంగణమంతా పార్టీ జెండాలతో గులాబీమయంగా మారింది. నగరంలోని ముఖ్య కూడళ్లలో, ప్రధాన మార్గాలలో కెసిఆర్ బొమ్మ ఉన్న కటౌట్లను, ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేసారు. డివైడర్ల మధ్య వివిధ పథకాలను తెలియచేసే డిజిటల్ పోస్టర్లను అతికించారు. నగరంలోని అన్ని ప్రధాన రోడ్లపై పార్టీ జెండాలను ఏర్పాటు చేసారు.
కట్టుదిట్టంగా బందోబస్తు
తెరాస వార్షికోత్సవ బహిరంగ సభకు భారీగా జనాలు వస్తున్న నేపథ్యంలో సభాస్థలి వద్ద, నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు పర్యవేక్షణలో 14 మంది ఎస్పీలు, డజన్ల సంఖ్యలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు బందోబస్తు విధులలో పాల్గొంటున్నారు. సిఐలు, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం సిబ్బంది, హోంగార్డులు కలిపి మొత్తం సుమారు ఆరువేలమందిని బహిరంగ సభ బందోబస్తు కోసం రంగంలోకి దింపారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచే కాకుండా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి పోలీసు అధికారులను, సిబ్బందిని బందోబస్తు విధుల కోసం వరంగల్ రప్పించారు. బహిరంగ సభాస్థలితోపాటు నగరాన్ని 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు అదనపు ఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు.
ముఖ్యమంత్రి బసచేసే రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు ఇంటివద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసారు. మంత్రులు, ఇతర వివిఐపిలు బసచేసే గెస్ట్‌హౌస్‌లు, ఇతర నివాస ప్రాంతాల వద్ద కూడా పోలీసు బందోబస్తు నియమించారు. బహిరంగ సభ సందర్భం వచ్చిపోయే వాహనాలతో నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బహిరంగ సభ అనంతరం జనాలు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయే వరకు, పార్కింగ్ స్థలాల నుంచి వాహనాలు వెళ్లిపోయేంత వరకు ఆయా ప్రాంతాలలో బందోబస్తు కోసం నియమితులైన అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి కదలకూడదని పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్షాల నుంచి, ప్రజాసంఘాల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చనే అనుమానంతో గట్టి నిఘా ఏర్పాటు చేసారు.