తెలంగాణ

మండుతున్న ఎండలు.. హరీమంటున్న ప్రాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉభయ తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండుతుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకార ఇప్పటి వరకు 80 మంది మరణించారు. వడదెబ్బ వల్ల ఎంత మంది మరణించారన్న విషయంపై రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4 లేదా 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనా, లేదా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా వేడిగాడ్పులుగా భావిస్తామని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా 45 డీగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇలా ఉండగా గత నాలుగేళ్లలో తెలంగాణ, ఎపిలలో 4246 మంది వడదెబ్బ వల్ల మరణించారు. గత ఏడాది 1600 మంది మరణించడంతో, ఈ విషయంలో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మరణాల రేటు కాస్త తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఐఎండి ఉన్నతాధికారులు ఎండాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ముందుగానే హెచ్చరించారు.ఎండలు మండుతుండటంతో పాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐఎండి ఇటీవలే హైదరాబాద్‌లో జాతీయస్థాయి సమావేశం నిర్వహించింది. ఐఎండి సూచనలు అనుసరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్తిస్తోంది. ఇలా ఉండగా పశు, పక్ష్యాదులు కూడా వేడిని తట్టుకోలేకపోతున్నాయి. గ్రామాల్లో నీటివనరులు లేని చోట్ల పశువులు, పక్షులు కూడా మలమల లాడుతున్నాయి.